Read more!

English | Telugu

అయ్యో రామా అలాంటిదాన్ని కాదు

 

అయ్యో రామా.. అలాంటి పనులు మా ఇంటా వంటా లేవు సుమీ! ఇలాంటి డైలాగులు నేటి హీరోయిన్లకు సరిగ్గా సెట్ అవుతాయి. సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లందరూ కూడా గ్లామర్ గా నటిస్తాను కానీ వల్గర్ గా కనిపించడానికి సిద్ధంగా లేను అని చెపుతారు. కానీ కొన్ని సినిమాల తర్వాత తమ అందాలతో జనాలకు చ్చేక్కించే సన్నివేశాలలో నటించి.."అది కేవలం కథలో భాగమే తప్ప అందాల ప్రదర్శన కోసం కాదు" అంటూ సైలెంట్ గా తప్పించుకుంటారు.

ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం మొదటి స్టేజ్ లో ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాష చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. హిందీలో ప్రస్తుతం "హమ్ షకల్స్" అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో తమన్నా బికినీ వేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తమన్నా స్పందిస్తూ... "ఏదైనా ఒక సినిమా ఒప్పుకునేముందే నేను స్పష్టంగా చెప్తాను. లిప్ లాక్ సన్నివేశాలు, బికినీలు వంటివి చేయను అని. ఇలా చెప్పడం వల్లే కొన్ని తెలుగు, తమిళ సినిమాలు కూడా వదులుకోవలసి వచ్చింది" అని చెపుతుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఈమెకు అవకాశాలు తగ్గితే లిప్ లాక్ సన్నివేశాలకే కాకుండా బికినీ వేసుకొని అందాల ఆరబోత చేసిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటూ సినీ వర్గాలు గుసగుసలు పెడుతున్నారు. మరి ఈ అమ్మడు బికినీ వేసే సమయం వస్తే ఎలాంటి మాటలు చెబుతుందో చూడాలి.