English | Telugu

కాంత మూవీ రివ్యూ 

కాంత మూవీ రివ్యూ 

Publish Date:Nov 13, 2025

  సినిమా పేరు:కాంత  తారాగణం:  దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని,రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు  మ్యూజిక్: జాను చంతర్. జెక్స్ బిజోయ్   రచన, దర్శకత్వం:సెల్వమణి సెల్వరాజ్ సినిమాటోగ్రాఫర్: డాని సాంచెజ్-లోపెజ్ ఎడిటర్ : అంథోని  బ్యానర్స్:స్పిరిట్ మీడియా, వేఫెరెర్ ఫిల్మ్స్  నిర్మాత: దుల్కర్ సల్మాన్,రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి  విడుదల తేదీ: నవంబర్ 12 , 2025    అభిమానులతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్  ఎంతగానో ఎదురుచూస్తున్న 'కాంత'(kaantha)మూవీ థియేటర్స్ లో కి వచ్చేసింది. లక్కీ భాస్కర్ వంటి ఘనవిజయం తర్వాత దుల్కర్ సల్మాన్(Dulquer salmaan)సిల్వర్ స్క్రీన్ పై మెరవడం, అగ్ర హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతున్న భాగ్యశ్రీ బోర్సే(Bhaghyashri Borse),దుల్కర్ కి జత కట్టడంతో కాంత పై మంచి అంచనాలే ఉన్నాయి.పాన్ ఇండియా కటౌట్ రానా(Rana daggubati)కీలక పాత్రలో చెయ్యడం కూడా ఈ చిత్రం స్పెషాలిటీ. మొట్టమొదటి తమిళ హీరో త్యాగరాజ భాగవతార్ జీవిత కథ అనే ప్రచారం కూడా ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ టికే మహదేవన్(దుల్కర్ సల్మాన్) తెలుగు సినిమా రంగంలో పెద్ద హీరో. నటచక్రవర్తి అనే బిరుదుతో లక్షలాది మంది అభిమానులని కలిగిన ఒక శక్తి. భార్య పేరు దేవి. apk ఉరఫ్ అయ్య(సముద్ర ఖని)ప్రతిభావంతమైన దర్శకుడు. సదరు దర్శక రంగంలోనే ఎవరెస్టు శిఖరం లాంటి వ్యక్తి. మహదేవన్, అయ్య కి ఒకరంటే ఒకరికి ద్వేషభావం. కానీ ఈ ఇద్దరి కాంబోలో 'శాంత' అనే మూవీ షూటింగ్ కి వెళ్తుంది. తన ఇగోతో శాంత ని కాస్త కాంతగా మహదేవన్ పేరు మారుస్తాడు. కుమారి(భాగ్యశ్రీ బోర్సే) ఆ మూవీలో హీరోయిన్. అనాధ అయిన కుమారిని అయ్య నే చేరదీసి హీరోయిన్ గా మొదటి అవకాశం ఇస్తాడు. మహదేవన్ మంచి వాడు కాదని, నమ్మక ద్రోహానికి మారుపేరని క్లోజ్ గా ఉండవద్దని కుమారికి షూటింగ్ ప్రారంభంలోనే అయ్య చెప్తాడు. కానీ కుమారి, మహదేవన్  ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు.ఒకరంటే ఒకరికి ఆరాధన భావం కూడా ఉంటుంది. కానీ  షూటింగ్ చివరి రోజున కుమారి హత్య చేయబడుతుంది. కుమారి ని చంపింది ఎవరు? మహదేవన్ నిజంగానే కుమారిని ప్రేమించాడా? లేక ప్రేమ అనేది నాటకమా? అసలు అయ్య కి మహదేవన్ మధ్య ఎందుకు గొడవలు? అంత గొడవల మధ్య ఆ ఇద్దరే కాంత సినిమాని ఎందుకు చెయ్యవలసి వచ్చింది? షూటింగ్ లో ఎలాంటి  గొడవలు జరిగాయి? మహదేవన్ చెడ్డవాడని అయ్య చెప్పినా కుమారి ఎందుకు ప్రేమించింది? మహదేవన్ చెడ్డవాడు కాదా?  ఈ కథ లో రానా పోషించిన ఫోనిక్స్ క్యారక్టర్  ఏంటి? అసలు కుమారిని ఎవరు చంపారు? అనేదే కాంత కథ  ఎనాలసిస్  ఈ రోజుల్లో కొంత మంది ఎందుకు ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా సినిమాలని తెరకెక్కిస్తున్నారు. అలాంటి వారందరిని కాంత సినిమా ఒక్కసారిగా ఆలోచనలో పడేస్తుందని చెప్పుకోవచ్చు. సినిమా అంటే ప్రేక్షకులు ఊహించని విధంగా ప్రవర్తించే  క్యారెక్టర్స్, చిత్రీకరణ, నటీనటుల భావోద్వేగాలు అని కాంత చెప్పినట్లయింది. ఒక రకంగా గత సినిమాల యొక్క వైభవాన్ని మరోసారి మన కళ్ళ ముందు ఉంచింది. కాకపోతే అయ్య, మహదేవన్ క్యారక్టర్ మధ్య జరిగిన గత కథ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది.   అయ్య క్యారక్టర్ లో సముద్ర ఖని కాకుండా దుల్కర్ కి సమానమైన హీరో ఎవరైనా చేసి ఉంటె ఇంకా బాగుండేదేమో. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ప్రారంభంలోనే కాంత కథ యొక్క ఉద్దేశ్యం చెప్పేసారు. కానీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు నటీనటుల పెర్ ఫార్మెన్స్ కట్టిపడేస్తుంది. మహదేవన్, అయ్య మధ్య షూటింగ్ సందర్భంగా వచ్చిన సీన్స్ కట్టిపడేశాయి. కుమారి, మహదేవన్ మధ్య లవ్ సీన్స్ కట్టిపడేశాయి. ఈ ఇద్దరి లవ్ సీన్స్  విషయంలోనే షూటింగ్ జరిగేటప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించాల్సింది.    తద్వారా సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ లేదనే లోటు తీరేది. కుమారి ని మరింత యాక్టీవ్ గా చూపిస్తూ ఉండాల్సింది.   రానా పోషించిన ఫోనిక్స్ క్యారక్టర్ ని తన పోలీస్ డ్యూటీ లో భాగంగా ఇంటర్వెల్ కి ముందు పరిచయం చేసి, ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కాంత కథలోకి ఎంటర్ అయినట్టు చూపించాల్సింది. ఇంటర్ వెల్ ట్విస్ట్ మాత్రం సూపర్. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చిన ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా వచ్చింది.ఎంతలా అంటే ఏ నిమిషం ఏం జరుగుతుంది. ఎవరు కుమారి ని హత్య చేసారు అనే సస్పెన్సు హండ్రెడ్ పర్శంట్ వర్క్ అవుట్ అయ్యింది. ఈ సందర్భంగా ఫోనిక్స్ క్యారక్టర్ ప్రవర్తించే తీరు కూడా ఆకట్టుకుంది. కాకపోతే సదరు క్యారక్టర్ ఓవర్ డోస్ గా ప్రవర్తించడానికి ఒక రీజన్ చెప్పుండాలసింది. కుమారి గతాన్ని కూడా ఒక కథగా చెప్పి సన్నివేశాలు సృష్టించి ఉంటే సదరు క్యారక్టర్ పై ఇంకొంచం జాలి కలిగేది.   ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం చాలా బాగున్నాయి. మన కళ్ళతో చూసింది, చెవులతో విన్న వాటిల్లో నిజం ఉండదు.   అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి అవతలి వారు చెప్పేది  పూర్తిగా వినకపోతే పక్క వారి జీవితాలని నాశనం చెయ్యడమే కాకుండా, మన జీవితంలో అమృతాన్ని పంచే ప్రేమని ఎలా దూరం చేసుకుంటామో అనే జీవిత సత్యాన్ని కూడా కాంత చెప్పింది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు నటీనటులు తో పాటు 24 క్రాఫ్ట్స్ పని తీరు ఎలా ఉందని అనే కంటే కాంత సినిమా కోసమే వాళ్లంతా పుట్టారా అని అనిపిస్తుంది. అంతలా తమ పనితనంతో మెస్మరైజ్ చేసారు. ముందుగా మహదేవన్ గా దుల్కర్ సల్మాన్ నటన ఎవరెస్టు శిఖరాన్ని అందుకుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి సన్నివేశం దాక వీరవిహారం చేసాడు.చిన్న చిన్న ఎక్స్  ప్రెషన్స్ లో కూడా అద్భుతంగా నటించి నిజంగానే నట చక్రవర్తి అనిపించుకున్నాడు.  తన సినీ జీవితంలో మహదేవన్ క్యారక్టర్ చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఇక కుమారి గా భాగ్యశ్రీ బోర్సే నటన గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. తనలో ఇంత పెర్ ఫార్మెన్సు ఉందా అనే ఆశ్చర్యం కూడా కలగక మానదు. కళ్ళతోనే హవ భావాలని పర్ఫెక్ట్ గా ప్రదర్శించే మరో నటి భాగ్యశ్రీ రూపంలో భారతీయ చిత్ర పరిశ్రమకి దొరికినట్లయింది. త్వరలోనే అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమని ఏలడం ఖాయం. ఇక అయ్య గా సముద్ర ఖని మరోసారి బెస్ట్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. తన క్యారక్టర్ లో భిన్నమైన వేరియేషన్స్ లేకపోయినా తనని వర్సటైల్ నటుడని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు. ఫినిక్స్ అనే పోలీస్ ఆఫీసర్ గా రానా ఎనర్జిటిక్ గా నటించడంతో పాటు పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేక పోయినా మహదేవన్ భార్యగా చేసిన నటి తో పాటు అందరు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతిక పరంగా చూసుకుంటే ఫొటోగ్రఫీ ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్సు కి ధీటుగా పని చేసింది. అంతలా ప్రతి ఫ్రేమ్ ని తన పని తనంతో నింపేసి సినిమాకి సరికొత్త వన్నె తెచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగా ప్లస్ అయ్యింది. సాంగ్స్ తక్కువే అయిన అర్థమవంతమైన సాహిత్యంతో ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పుకుందామన్నా ఈ విషయంలో కూడా ఫొటోగ్రఫీ ఆ అవసరాన్ని కలిపించలేదు. దర్శకుడుగా,రచయితగా సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj)సక్సెస్ అయ్యాడు. నటీనటుల నుంచి నటనని రాబట్టడంలో కాంప్రమైజ్ కాలేదు.   ఫైనల్ గా చెప్పాలంటే కథ, కథనాలు నలుగురి వ్యక్తుల మధ్యనే జరిగినా కూడా నటీనటుల ఎవర్ గ్రీన్ పెర్ ఫార్మెన్స్, సస్పెన్సు, ప్రేమ వంటి అంశాలు కాంత ని మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది.   రేటింగ్ 2 .75 /5                                                                                                                                    అరుణాచలం   
Kaantha Movie Review 

Kaantha Movie Review 

Publish Date:Nov 13, 2025

Cast: Dulquer Salmaan, Bhagyashrii Borse, Rana Daggubati, Samuthirakani, Nizhalgal Ravi, Ravindra Vijay Crew:  Music by Jhanu Chanthar, Jakes Bejoy Cinematography by Dani Sanchez-Lopez Edited by Llewellyn Anthony Gonsalvez Written by Tamizh Prabha, Selvamani Selvaraj Directed by Selvamani Selvaraj Produced by Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, Jom Varghese   Dulquer Salmaan has become the poster boy of period dramas and in Telugu, he did every film that narrates a story in the past. Mahanati, Sita Ramam, Lucky Baskhar all have gone to the bygone era and Kaantha is a film within a film that too from 1950's. Rana Daggubati has produced the film and he even been part of it. Bhagyashri Borse is playing the leading lady. Let's dive into the details about the film.    Plot:  TK Mahadevan (Dulquer Salmaan) is one of the biggest stars of Cinema and he is the discovery of a highly talented and respected director, Ayya (Samuthirakani). Ayya wants to direct a film, Shantha, to honor his mother and it is Mahadevan, who gives the idea after their first film. But they both are not on talking terms and have ego issues. Still, Mahadevan comes forward to rejuvenate the film but on his own terms.  He changes the movie title to Kaantha but the leading lady Kumari (Bhagyashri Borse) promises to Ayya that she would listen to only his word. Mesmerised by her talent and beauty, Mahadevan doesn't object to her yet he keeps showcasing his star power on sets. Slowly, Kumari and Mahadevan grow closer and fall in love. But Mahadevan is already married and that too, to a very famous media baron. So, where does the ego battle and fame lead the story forward? What does Pheonix (Rana Daggubati) do to find out the truth behind everything? Watch the movie to know more.  Analysis:  Dulquer Salmaan deserves every award in the book for his stunning performance. He is able to bring the yesteryear actor character to life with ease and deliver the melodrama on point. He is the cog that holds the script together with his genuine and honest performance. The mirror scene in the first hour and climax juxtaposed perfectly and he nailed both with variations.  Rana Daggubati is cool and good in his performance. Bhagyashri Borse got a very heavy role and she needed to look innocent. While she tried her best the performance did not really stand out as much as the script needed. Still, she did look the part and her screen presence had been stunning. Samuthirakani looked too serious and did not really carry the layered character as it came across monotonous.  Selvamani Selvaraj's ambition is applaudable has he is able to bring authenticity to the proceedings from the first frame. But the writing and execution lacked any sort of novelty as they looked like derived from Mahanati and Iddaru without the same level of brilliance. The sequences looked repetitive rather than engaging after a point as narrative did not really hold on to one sort of rhythm.  While it starts as a battle of egos, it transforms into romance, then into a film within a film and then an investigation. None of the elements really sustain the interest as much as the performances do. While Dulquer aces out some of the other actors did seem a little bit uneven. Technically, the portions of film within a film are brilliant and even production values are high quality.  Sound department worked hard to bring the old world atmosphere believable and frames are richly lit to feel like a painting. Writing needed to be much better for this drama to really flourish as the narrative seems to be going in rounds unable to find the unifying cog and tone. Kaantha is film for performances and each actor delivers at least one brilliant scene while Dulquer just smacks it out of the park.  Bottomline:  Performances and technical values enhance a middling drama.    Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

రాజబాబు ఒక హిందీ సినిమా చేశారు.. ఎంత తీసుకున్నారో తెలుసా?

Publish Date:Nov 12, 2025

పాత తరం హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు రాజబాబు. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని డిఫరెంట్‌గా డైలాగులు చెప్పడంతోనేకాదు, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ చేసేవారు. 1960లో వచ్చిన సమాజం చిత్రంలో తొలిసారి చిన్న పాత్రలో నటించారు రాజబాబు. ఆ తర్వాత తండ్రులు కొడుకులు, కులగోత్రాలు చిత్రాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ క్రమంలోనే స్వర్ణగౌరి చిత్రంలో నటించారు. ఈ సినిమాకి తొలిసారి అందుకున్న పారితోషికం 350 రూపాయలు.  అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న రాజబాబు కెరీర్‌ అంతస్తులు చిత్రంతో ఒక్కసారిగా టర్న్‌ తీసుకుంది. ఈ సినిమాకి 1300 రూపాయల పారితోషికం ఇచ్చారు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌. ఈ సినిమా తర్వాత రాజబాబును వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో బిజీ కమెడియన్‌ అయిపోయారు. ఒక దశలో రాజబాబు ఉంటేనే సినిమాను రిలీజ్‌ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను అడిగే స్థాయికి చేరుకున్నారు.  కమెడియన్‌గా అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న తరుణంలోనే రాజబాబుకి ఒక హిందీ సినిమా చేసే ఛాన్స్‌ వచ్చింది. 1975లో విడుదలైన ‘రాణీ ఔర్‌ లాల్‌పరి’ అనే సినిమాలోని ఒక పాట కోసం రాజబాబుని బొంబాయి పిలిపించారు. పిల్లలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఎంతో మంది బాలీవుడ్‌ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఆ క్రమంలోనే తెలుగు నుంచి రాజబాబు వెళ్లారు. ఈ సినిమాలోని ఒక పాటలో లిల్లీపుట్‌గా నటించారు.  షూటింగ్‌ పూర్తయిన తర్వాత రెమ్యునరేషన్‌ ఎంత ఇవ్వమంటారు అని రాజబాబుని అడిగారు నిర్మాత. ఆ ఒక్క పాట కోసం రెమ్యునరేషన్‌ ఆశించలేదు రాజబాబు. ఆయన అడిగినందుకు ‘మీ ఇష్టం’ అన్నారు. చేసింది ఒక పాటే కాబట్టి ఐదు వేలు ఇస్తే అదే ఎక్కువ అనుకున్నారు. కానీ, ఆ నిర్మాత 40 వేల రూపాయలు చేతిలో పెట్టారు. అంత ఎమౌంట్‌ ఇచ్చేసరికి షాక్‌ అయ్యారు రాజబాబు. ఆ డబ్బు తీసుకున్నారు. తను అనుకున్న 5 వేలు ఉంచుకొని మిగతా 35 వేలను ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్న టెక్నీషియన్స్‌ అందరికీ పంచి పెట్టేశారు. రాజబాబు మంచితనాన్ని ప్రతిబింబించే సంఘటనలలో ఇదొకటి. రాజబాబుకి సేవా గుణం ఎక్కువ. తన జీవితంలో ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

కుప్పకూలిపోయిన హీరో గోవిందా.. ప్రస్తుత పరిస్థితి ఇదే

Publish Date:Nov 11, 2025

    -కుప్పకూలిపోయిన హీరో గోవిందా -ఆరోగ్యం ఎలా ఉంది. -అభిమానుల కంగారు  -గోవిందా స్నేహితుడి ప్రకటన    బాలీవుడ్ కి సరికొత్త డాన్స్ ని, కామెడీ టైమింగ్ ని నేర్పిన హీరో 'గోవిందా'(Govinda). సాధారణంగా హీరో పేరుని ఎవరైనా పలకన్నా సదరు హీరో పేరు చెప్తారు. కానీ గోవిందా విషయానికి  వచ్చే సరికి హీరో గోవిందా అని ఉచ్చరిస్తుంటారు. దీన్ని బట్టి గోవిందా కి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉన్న క్యాపబిలిటీని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా గోవిందా  అస్వస్థతకి గురవ్వడం జరిగింది.   నిన్న అర్ధరాత్రి తన నివాసంలో ఉన్నట్టుండి  ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో  హుటాహటిన కుటుంబసభ్యులు హాస్పిటల్ కి తరలించారు. ఈ విషయంపై గోవిందా స్నేహితుడు లలిత్ బిందాల్ జాతీయ మీడియా తో మాట్లాడుతు గోవిందా కి ముంబై జుహులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతుంది.ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపాడు.   also Read:  నాగార్జున పై అర్ధరాత్రి మంత్రి కొండ సురేఖ సంచలన ట్వీట్   1986 సినీ రంగ ప్రవేశం చేసిన గోవిందా తన కెరీర్ లో సుమారు 140 చిత్రాల వరకు చేసాడు. వాటిల్లో ఎక్కవ శాతం హిట్స్ ఉన్నాయి. చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనపడిన చిత్రం రంగీలా రాజా. డ్యూయల్ రోల్ లో కనిపించగా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి  2004 నుండి 2009 వరకు ముంబై నార్త్ నియోజకవర్గం నుండి ఎంపి గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 'శివసేన' పార్టీ లో కొనసాగుతున్నారు. వయసు 61 సంవత్సరాలు.  

విజయ్ బిన్నీ మాష్టర్ నెక్స్ట్ మూవీలో ఢీ నుంచి ముగ్గురికి అవకాశం

Publish Date:Nov 13, 2025

  ఢీ 20 ప్రతీ వారం ఎపిసోడ్స్ లో ఏదో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఉంటూనే ఉంది. ఇక ఈ వారం టాపిక్ లో కూడా అలాగే ఒక విషయం ఉంది. హోస్ట్ నందు కంటెస్టెంట్ మణికంఠ మాష్టర్ తో కలిసి "బోనం ఎత్తి బయలెల్లు" అనే సాంగ్ కి మంచి జోష్ తో నాటు స్టెప్స్ వేసాడు. దాంతో కంటెస్టెంట్స్ జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. వెంటనే ఆది ఒక రిక్వెస్ట్ చేసాడు. "తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరికీ...మా ఢీ షో తరపు నుంచి చిన్న రిక్వెస్ట్. నందు బ్రోకి ఒక పెద్ద అవకాశం ఇవ్వండి. ఆ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే మనోడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు..అలాంటి ఒక పెద్ద అవకాశం కోసం నందు బ్రో ఎంత వెయిట్ చేస్తున్నాడో అతని తమ్ముడి లాంటి వాడిని నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నా." అని చెప్పాడు. దాంతో నందు ఆదిని ముద్దు పెట్టుకుని లవ్ యు ఆది. ఇక దీపికా లేచి "నందు గారు మీతో హీరోయిన్ గా నటించడానికి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పింది. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ లేచి "మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు కానీ మీరు చాలా బాగా చేశారు"  అంటూ నందుని పొగిడారు. "ఆది గారు మీరు నందు బ్రో కోసం రిక్వెస్ట్ చేశారు డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి. బట్ నేను డైరెక్టర్ గా చెప్తున్నాను నేను ఈ ఢీషో నుంచి నా నెక్స్ట్ మూవీలో ఒకరికి కోరియోగ్రఫీ అవకాశం అలాగే ఇంకో ఇద్దరికీ యాక్టింగ్ అవకాశం ఇస్తాను. నెక్స్ట్ రాబోతున్న పెద్ద సినిమాలోకి ఎవరిని తీసుకోబోతున్నానో ఫినాలే రోజున అనౌన్స్ చేస్తాను" అని చెప్పారు. "ఈ అనౌన్స్మెంట్ తో మరింత కిక్ ని, ఎనర్జీని నిమ్పరారు. మీరు ఇచ్చిన ఈ ఫినాలే అనౌన్స్మెంట్ వలన వీళ్లంతా ఫినాలే వరకు రావడానికి గట్టిగా ట్రై చేస్తారు." అన్నారు ఆది, నందు.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

మహేష్ డైరెక్టర్ తో సూర్య మూవీ.. దిల్ రాజు డేరింగ్ స్టెప్!

Publish Date:Oct 30, 2025

  మరో తెలుగు దర్శకుడితో సూర్య మూవీ మహేష్ డైరెక్టర్ కి ఓకే చెప్పిన తమిళ హీరో! దిల్ రాజు నిర్మాణం..?   కోలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విజయ్ 'వారసుడు' చేయగా, ధనుష్ 'సార్, కుబేర' సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు సూర్య వంతు వచ్చింది. ఇప్పటికే వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్న సూర్య.. మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Suriya)   సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న తమిళ హీరో సూర్య.. తన 45వ సినిమా 'కరుప్పు'ని ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. అలాగే తన 46వ సినిమా కోసం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు సూర్య మరో తెలుగు దర్శకుడితో చేతులు కలబోతున్నట్లు సమాచారం.   Also Read: రష్మిక సినిమాలో సందీప్ రెడ్డి.. ఆడియెన్స్ నవ్వుతారు!   సోలో, గీత గోవిందం వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్.. కొంతకాలంగా హీరోల వేటలో ఉన్నాడు. మహేష్ బాబుతో చేసిన 'సర్కారు వారి పాట' పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. విజయ్ దేవరకొండతో చేసిన 'ది ఫ్యామిలీ స్టార్' నిరాశపరిచింది. వీటికి తోడు, రకరకాల కారణాల వల్ల తెలుగు హీరోలు పరశురామ్ కి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తమిళ హీరో కార్తీతో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ప్రయత్నించాడు. ఎందుకనో అది వర్కౌట్ కాలేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా కార్తీ సోదరుడు సూర్యతో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.   పరశురామ్ చెప్పిన కథకు సూర్య ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మించనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని వార్తలొస్తున్నాయి.  

After NTR even Aamir shelves Dadasaheb Phalke biopic

Publish Date:Nov 11, 2025

NTR and Aamir Khan have been at a race to star in the biopic of Father of Indian Cinema, Dadasaheb Phalke. The news reports have suggested that SS Rajamouli is going to produce the film with NTR while Rajkumar Hirani will direct Aamir Khan's version. Recently, NTR has dropped out of the project.  While his close sources have denied that NTR even considered to be part of the biopic, the recent reports have given his fans a sigh of relief. They did not want their action hero to play such a period film, at this juncture. Now, reports suggest that Aamir Khan and Rajkumar Hirani have decided to shelve their project.  Close sources have revealed that the actor did not feel the movie could live up to expectations risen by their union after films like 3 Idiots and PK. He felt that any other script would do justice rather than this one. Even Hirani agreed and started working on his next without Aamir in consideration.  Aamir Khan is busy finalising his next film script and he is apparently hearing to 25 scripts and he might announce his next in a couple of months. For now, Dadasaheb Phalke biopic is not happening in any language of Indian Cinema.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

కృష్ణలీల

Publish Date:Nov 7, 2025

జటాధర

Publish Date:Nov 7, 2025

ఆర్యన్

Publish Date:Nov 7, 2025

The Girl Friend

Publish Date:Nov 7, 2025

The Great Pre-Wedding Show

Publish Date:Nov 7, 2025

Jatadhara

Publish Date:Nov 7, 2025

Aaryan

Publish Date:Nov 7, 2025

Mass Jathara

Publish Date:Oct 31, 2025