English | Telugu

తెలంగాణ కోడలు కాబోతున్న అనుష్క!

తెలుగు ప్రేక్షకులు హీరో ప్రభాస్ పెళ్లి కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో, హీరోయిన్ అనుష్క పెళ్లి కోసం అంతగానే ఎదురుచూస్తున్నారు. ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని, తాము మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.

'సూపర్'(2005) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క.. 'విక్రమార్కుడు', 'అరుంధతి' వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'బాహుబలి'తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. సినిమాలలో స్పీడ్ తగ్గించిన ఈ 41 ఏళ్ళ భామ ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. నిజమైతే మాత్రం అనుష్క తెలంగాణ కోడలు కానుందన్నమాట. ఇంతకీ అనుష్కను పెళ్లాడనున్న ఆ వ్యాపారవేత్త ఎవరో మరి.