Read more!

English | Telugu

ఒక చిరంజీవి పాట.. ఇద్ద‌రు కొరియోగ్రాఫ‌ర్లు!

 

దివంగ‌త ద‌ర్శ‌క నిర్మాత విజ‌య బాపినీడు ఏది త‌ల‌పెట్టినా అది వైవిధ్యంగానే ఉంటుంది. మెగాస్టార్‌ చిరంజీవిని టైటిల్ రోల్‌లో చూపిస్తూ ఆయ‌న రూపొందించిన 'గ్యాంగ్ లీడ‌ర్' మూవీ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాల్లో ఆ సినిమా విజ‌యోత్స‌వాన్ని ఆయ‌న‌ నిర్వ‌హించారు. అలాగే ఏకంగా రెండు ల‌క్ష‌ల మంది చిరంజీవి అభిమానుల స‌మ‌క్షంలో 'బిగ్ బాస్' (1995) మూవీని ఆయ‌న ప్రారంభించారు. 'గ్యాంగ్ లీడ‌ర్‌'కు బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఇచ్చిన బ‌ప్పీల‌హిరి 'బిగ్ బాస్‌'కు కూడా సంగీతం స‌మ‌కూర్చారు. 

ఈ చిత్రంలోని పాట‌ల విషయంలో విజ‌య బాపినీడు చాలా శ్ర‌ద్ధ తీసుకున్నారు. వైవిధ్యంగా ఆ పాట‌ల‌ను చిత్రీక‌రించారు. రెండు పాట‌ల్ని ఊటీలో చిత్రీక‌రించారు. వాటిలో ఒక పాట‌ స‌గ‌భాగాన్ని చిన్నిప్ర‌కాశ్ కొరియోగ్ర‌ఫీలో తీసిన ఆయ‌న‌, మ‌రో స‌గ‌భాగాన్ని రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీలో చిత్రీక‌రించారు. పాట చిత్రీక‌ర‌ణ‌లో వైవిధ్యం చూపించేందుకే ఆ పాట‌ను ఇద్ద‌రు కొరియోగ్రాఫ‌ర్ల‌తో తీసిన‌ట్లు అప్ప‌ట్లో ఆయ‌న చెప్పారు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'బిగ్ బాస్' ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా, పాట‌లు మాత్రం సూప‌ర్ హిట్ట‌వ‌డ‌మే కాకుండా, ఆడియో రైట్స్ అమ్మ‌కాల్లో ఆ సినిమా రికార్డ్ సృష్టించింది.