Read more!

English | Telugu

ఆ రికార్డు విషయంలో  టైటానిక్ తర్వాత శ్రీ రాములయ్యనే 

1997 వ సంవత్సరంలో విడుదలైన టైటానిక్ అనే మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్ని  ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా  ప్రపంచ సినిమాని ఏకం కూడా  చేసింది. ఆ రోజుల్లో టైటానిక్  సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు నగరాల్లోని ప్రధాన  ఏరియాల్లో హండ్రెడ్ డేస్ ని కూడా జరుపుకుంది. పైగా ఇప్పటివరకు  వరల్డ్ మొత్తం మీద వచ్చిన బెస్ట్ లవ్ మూవీ కూడా అదే. టైటానిక్  వచ్చిన రెండు సంవత్సరాలకి అంటే 1999 లో పేద,బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన పోరాటయోధుడు శ్రీ రాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీ రాములయ్య మూవీ విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఒక విషయంలో టైటానిక్ తర్వాత సినిమాగా నిలబడి   చరిత్రలో తన కంటు ఒక రికార్డు ని పదిలంగా ఉంచుకుంది.ఇంతకీ ఆ రికార్డు ఏంటో చూద్దాం..   
  
ఒక సినిమాకి ఎంత అధ్బుతమైన కథ సమకూరినా కూడా కెమెరా బాగుంటేనే ఆ చిత్రం యొక్క ఉద్దేశం ప్రేక్షకుడికి చేరుతుంది. ఇదే విధంగా టైటానిక్ మూవీలోని ప్రతి షాట్ కూడా ఎంతో వైవిధ్యంతో  కూడుకొని  ఉంటుంది.అలాగే ప్రతి సీన్ ని కూడా మన కళ్ళ ముందు జరుగుతుందేమో అనే విధంగా కెమెరా కట్టిపడేస్తుంది.ఇక  ఆ మూవీ క్లైమాక్స్ లో   టైటానిక్ షిప్  కూలిపోయే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని షాట్స్ పరంగా చూపించే క్రమంలో టాప్ యాంగిల్ లో కూడా చూపిస్తారు. ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే ఆ షాట్స్ ని అకేలా క్రేన్ సాయంతో  తీశారు. ప్రపంచ సినిమా యవనిక మీద అ కేలా క్రేన్ పరిచయం అవ్వడం అదే మొదటి సారి. షిప్ కూలిపోవడాన్ని ఆకాశంలో నుంచి చూపించే  ఆ షాట్ ఆ రోజుల్లో  ఒక పెద్ద సంచలనం. అంతే కాకుండా ఆ షాట్ ప్రేక్షకులని సంబ్రమాశ్చర్యాలకి  కూడా  గురి చేసింది.అలాగే  ఆ మూవీలోని చాలా షాట్స్ కొత్త దర్శకుడు అవుదామనుకునే వారికి ఒక పాఠ్య పుస్తకం అని కూడా చెప్పవచ్చు.

 ఆ మూవీ తర్వాత అకేలా క్రేన్ తో షాట్ తీసిన రెండవ  సినిమాగా శ్రీ రాములయ్య చరిత్ర పుటల్లో  నిలిచింది. మూవీ ప్రారంభంలో టైటిల్స్ పడుతుండగానే  మేకర్స్  శ్రీరాములయ్య సమాధిని చూపించడం జరుగుతుంది. ఈ సీన్ నే రక రకాల షాట్స్ ల్లో టాప్ యాంగిల్ లో చూపించడం జరుగుతుంది. ఒక హెలికాఫ్టర్ కి అకేలా క్రేన్ కట్టి ఆ షాట్ తీశారు. ఆ షాట్  చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు పుట్టించేలా ఉంటుంది. ఈ విధంగా టైటానిక్ సినిమా తర్వాత అకేలా క్రేన్ వాడిన సినిమాగా శ్రీరాములయ్య రికార్డుని సృష్టించింది. ప్రముఖ  దివంగత నేత పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీ రాములయ్య  తెరకెక్కింది. ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ  మూవీ టైటిల్ రోల్ లో మోహన్ బాబు ఆయన భార్యగా  సౌందర్య నటించింది. అలాగే శ్రీ రాములయ్య కొడుకు రవి గా కూడా మోహన్ బాబే నటించాడు. దివంగత నందమూరి హరికృష్ణ కూడా ఒక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీలోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి. పరిటాల రవినే  నిర్మాతగా వ్యవహరించాడు.