Read more!

English | Telugu

ప్రేయసిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్‌!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన హీరో. కేవలం స్వయంకృషితోనే ఈ స్థాయికి వచ్చిన రజినీకాంత్‌ జీవితంలో ఓ ప్రేమకథ కూడా ఉందని మీకు తెలుసా.. మలయాళ నటుడు, రజినీ స్నేహితుడు దేవన్‌.. రజినీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిచారు. ఒక సినిమా షూటింగ్‌ కోసం చెన్నయ్‌లో ఉన్నప్పుడు దేవన్‌ను డిన్నర్‌కి రావాల్సిందిగా తన రూమ్‌కి ఆహ్వానించారు రజినీ. అప్పుడు ఆయన గదికి వెళ్లారు దేవన్‌. డిన్నర్‌కి కావాల్సినవి అన్నీ తెప్పించారు. అప్పటికి కాస్త మద్యం సేవించి ఉన్న రజినీ ‘నీకు తొలి ప్రేమ ఉందా?’ అని దేవన్‌ని అడిగారు. అతను తన లవ్‌స్టోరీని వినిపించాడు. అది విన్న రజినీ ఎమోషనల్‌ అయ్యారు. తన లవ్‌స్టోరీని చెప్పడం మొదలుపెట్టారు. 


‘బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బెంగళూర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న నిర్మలతో పరిచయం ఏర్పడిరది. ఆమె బస్సు ఎక్కినప్పుడల్లా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. ఓరోజు నేను ప్రధాన పాత్ర పోషించబోతున్న నాటకాన్ని చూడటానికి నిర్మలను పిలిచాను. నాటకం చూసింది. ఆపై కొన్ని రోజులకు మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్‌ వచ్చింది. నేను దాని కోసం దరఖాస్తు చేసుకోలేదు. అయినా ఆ లెటర్‌ రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నాటకంలో నా నటన ఆమెకు బాగా నచ్చడంతో, నా తరఫున మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో అప్లికేషన్‌ వేసింది. నేను పెద్ద స్టార్‌ కావాలని ఆమె కోరుకుంది. ఆ సమయంలో బెంగళూరు నుంచి చెన్నయ్‌ వెళ్లడానికి కూడా నా దగ్గర డబ్బులేదు. నా పరిస్థితి గురించి తెలిసిన నిర్మల రూ.500 ఇచ్చి చెన్నయ్‌ పంపించింది. మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన కొన్నాళ్లకు బెంగళూరు వెళ్లాను. అక్కడ నిర్మల కనిపించలేదు. ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు పక్కల ఎంక్వయిరీ చేస్తే వారి కుటుంబం మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అయ్యారని తెలిసింది. ఆ తర్వాత కూడా నిర్మల కనిపించలేదు. నేను ఎప్పుడు బెంగళూరు వెళ్లినా నిర్మల కనిపిస్తుందేమోనని చూస్తాను. నా దృష్టిలో ఆమె గొప్ప మహిళ. అందుకే ఎవరినీ బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పటివరకు నన్ను చూసేందుకు కూడా రాలేదు. ఆమెను నేను మర్చిపోయానని అనుకుందో ఏమో’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు రజినీకాంత్‌. చాలా సేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయారు. తన లవ్‌స్టోరీ చెప్పి ఎంతో ఎమోషనల్‌ అయిన రజినీని ఓదార్చారు దేవన్‌.  ఏదో ఒక రోజు నిర్మల కనిపిస్తుందని రజినీకి ధైర్యం చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత రజినీ సాధారణ స్థితికి వచ్చారు. రజినీకాంత్‌ జీవితంలో జరిగిన ఈ విశేషాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు దేవన్‌.