Read more!

English | Telugu

రెండు సార్లూ కొడుక్కి స‌రైన స్క్రిప్టు ఇవ్వ‌లేక‌పోయిన పూరి జ‌గ‌న్నాథ్‌!

 

తెలుగునాట హీరోయిజానికి స‌రికొత్త డైమ‌న్ష‌న్ ఇచ్చిన డైరెక్ట‌ర్ గా పూరీ జ‌గ‌న్నాథ్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. త‌న మొద‌టి సినిమా `బ‌ద్రి` (2000) మొద‌లుకుని `ఇడియ‌ట్` (2002), `అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి` (2003), `శివ‌మ‌ణి` (2003), `పోకిరి` (2006), `దేశ‌ముదురు` (2007), `చిరుత‌` (2007), `బిజినెస్ మేన్` (2012), `ఇస్మార్ట్ శంక‌ర్` (2019) వ‌ర‌కు పూరీ సొంతంగా త‌యారుచేసుకున్న స్క్రిప్ట్ ల‌న్నీ ఆయా చిత్రాల్లో క‌థానాయ‌కుల‌ను స‌రికొత్తగా ఆవిష్క‌రించిన‌వే. అయితే, ఇదంతా నాణేనికి ఒక‌వైపు.

మ‌రోవైపు ఏంటంటే.. త‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌థానాయ‌కులుగా పెట్టి సినిమాలు తీసేట‌ప్పుడు మాత్రం పూరీ త‌డ‌బ‌డుతూనే ఉన్నారు. 17 ఏళ్ళ క్రితం త‌న త‌మ్ముడు సాయిరామ్ శంక‌ర్ ని `143`(2004)తో హీరోగా ప‌రిచ‌యం చేసిన సంద‌ర్భంలోనూ.. మూడేళ్ళ క్రితం త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని `మెహ‌బూబా` (2018)తో హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేసిన సంద‌ర్భంలోనూ పూరి `స్క్రిప్ట్స్` బాక్సాఫీస్ ముంగిట కాసుల జ‌ల్లు కురిపించ‌లేక‌పోయాయి. ర‌వితేజ లాంటి స్ట్ర‌గులింగ్ హీరోని స్టార్ గా మ‌లిచినా - పునీత్ రాజ్ కుమార్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ కిడ్స్ ని సెన్సేష‌న‌ల్ డెబ్యూస్ తో ప‌రిచ‌యం చేసి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించినా.. మ‌హేశ్ బాబు ని సూప‌ర్ స్టార్ గా మ‌ల‌చ‌డంలో కీల‌క పాత్ర పోషించినా.. అది ఒక్క పూరీకే ద‌క్కింది.

అలాంటిది.. త‌న త‌మ్ముడు, త‌న‌యుడికి సూట‌బుల్ స్టోరీస్ ని వండ‌డంలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోతున్నారు జ‌గ‌న్. ఇక త‌న శిష్యుడు, డెబ్యూ డైరెక్ట‌ర్ (అనిల్ పాడూరి) చేతిలో త‌న త‌న‌యుడు ఆకాశ్ ని అప్ప‌జెప్పి.. త‌నే స్వ‌యంగా క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, నిర్మాణం బాధ్య‌త‌లు చేప‌ట్టిన `రొమాంటిక్` కూడా సాలిడ్ పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకోలేక‌పోతోంది. ఇంకా మీసాలు కూడా స‌రిగ్గా మొల‌వ‌ని ఓ సాధార‌ణ కుర్రాడు.. డాన్ అయిపోవ‌డం, ఓ గ్యాంగ్ ని మెయింటెన్ చేయ‌డం - ఇలాంటి స్క్రిప్ట్ తో `రొమాంటిక్`ని టైటిల్ కి భిన్న‌మైన ఇంకో కోణంలోనూ తీర్చిదిద్ద‌డం అంత‌గా రుచించ‌ని వ్య‌వ‌హార‌మే అంటున్నారు చూసిన జ‌నాలు. అయితే, రొమాంటిక్ సీన్స్ మాత్రం టార్గెట్ ఆడియ‌న్స్ అయిన యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసాయంటున్నారు. 

మొత్తంగా..  ఆకాశ్ లో పూరి మార్క్ `క‌థానాయ‌కుడు` ఉన్నా.. అత‌నికి రైట్ స్క్రిప్ట్ ఇవ్వ‌డంలో మాత్రం పూరి త‌డ‌బ‌డుతున్నార‌న్న‌ది `రొమాంటిక్` చూసిన‌వాళ్ళ టాక్. మ‌రి.. భ‌విష్య‌త్ లోనైనా త‌న త‌న‌యుడి అభిన‌య సామార్థ్యానికి త‌గ్గట్టుగా అన్ని ర‌కాల అంశాలు మేళ‌వించిన క‌థ‌ని అందించి టాలీవుడ్ కి త‌న మార్క్ `స్టార్`ని పూరి ప్ర‌జెంట్ చేస్తారేమో చూడాలి.