Read more!

English | Telugu

అతి త‌క్కువ చ‌దువుకున్న 9 మంది పాపుల‌ర్‌ బాలీవుడ్ యాక్ట‌ర్స్‌!

 

చ‌దివింది త‌క్కువే కావ‌చ్చు, కానీ దేశ‌వ్యాప్తంగా.. ఆ మాటకొస్తే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను వారు సంపాదించుకున్నారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తూ, ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యంలో బాగా చ‌దువుకున్న తోటి న‌టుల్లో చాలా మంది కంటే వారు ఇటు అభిమానుల్నీ, అటు ఆస్తుల్నీ సంపాదించుకున్నారు. టాలీవుడ్ విష‌యానికే వ‌స్తే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్మీడియేట్ త‌ప్పార‌నే విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లో అలా త‌క్కువ చ‌దుకున్నా, ఎక్కువ అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్న స్టార్లు ఎవ‌రో చూద్దాం...

ఆమిర్ ఖాన్‌


న‌టుడిగా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అయిన ఆమిర్ చ‌దువులో మాత్రం కాదు. ముంబైలోని నార్సీ మంజీ కాలేజీలో ట్వ‌ల్త్ క్లాస్‌తో చ‌దువుకు ఫుల్‌స్టాప్ పెట్టి సినిమాల్లోకి వ‌చ్చేశాడు.

అక్ష‌య్‌కుమార్‌


తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ హోల్డ‌ర్ అయిన అక్ష‌య్‌కుమార్ స్కూల్ చ‌దువు త‌ర్వాత ముంబైలోని గురునాన‌క్ ఖ‌ల్సా కాలేజీలో డిగ్రీలో చేరి ఏడాది త‌ర్వాత మ‌ధ్య‌లో మానేశాడు. ఇవాళ ఫోర్బ్స్ రిచ్చెస్ట్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా నిలిచాడు.

అర్జున్ క‌పూర్‌


బోనీ క‌పూర్ కుమారుడైన అర్జున్ క‌పూర్ చ‌దువు విష‌యంలో మ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌రిజోడీ. అంటే 11వ క్లాస్ త‌ప్పి, దానిని పూర్తి చేయ‌లేక చ‌దువును వ‌దిలేశాడు. కానీ, ఇప్పుడు యాక్ట‌ర్‌గా రాణిస్తున్నాడు.

హేమ‌మాలిని


చెన్నైలోని ఆంధ్ర మ‌హిళాస‌భ‌లో 11వ క్లాస్ చ‌దువుతూ మ‌ధ్య‌లో మానేసినా, డ్రీమ్ గాళ్‌గా అంద‌రి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు.

కాజోల్‌


బోర్డ‌ర్‌లో ఉన్న పంచ‌గ‌నిలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో చ‌దువుకున్న కాజోల్ ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో బేఖుడి సినిమా అవ‌కాశం రావ‌డంతో చ‌దువుకు స్వ‌స్తి చెప్పేసింది.

కంగ‌నా ర‌నౌత్‌


బాలీవుడ్‌లో 'క్వీన్‌'గా అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించి కాంటెంప‌రరీ యాక్ట్రెస్‌ల‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగ‌నా ర‌నౌత్ చండీగ‌ఢ్‌లోని డీఏవీ మోడ‌ల్ స్కూల్‌లో ట్వ‌ల్త్ క్లాస్‌తో చ‌దువు ఆపేసి, మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టింది.

క‌త్రినా కైఫ్‌


స్కూల్ చ‌దువు లేకుండానే యు.ఎస్‌.లో ఎక‌నామిక్స్‌లో డిగ్రీ పొందిన తార క‌త్రినా కైఫ్‌. ఇవాళ బాలీవుడ్‌లోని హ‌య్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌ల‌లో ఆమె ఒక‌రు.

స‌ల్మాన్ ఖాన్‌


బాలీవుడ్ భాయ్‌గా పేరుగాంచిన స‌ల్మాన్ ఖాన్‌ను బాలీవుడ్ ర‌జ‌నీకాంత్ అని కూడా పిలుస్తుంటారు. బాలీవుడ్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్స్‌లో ఎక్కువ సినిమాలున్న స్టార్ అయిన స‌ల్మాన్ ట్వ‌ల్త్ క్లాస్ త‌ర్వాత ముంబైలోని సెయింట్ జేవియ‌ర్స్ కాలేజీలో డిగ్రీలో చేరి, మ‌ధ్య‌లో మానేసి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా అడుగుపెట్టాడు.

శ్రీ‌దేవి


క‌నీసం స్కూల్‌కు కూడా వెళ్ల‌కుండానే బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చి, సౌత్‌, నార్త్ తేడా లేకుండా అంద‌రి ఆరాధ్య తార‌గా మారారు ఈ అతిలోక సుంద‌రి. ఇంటి ద‌గ్గ‌ర టీచ‌ర్ ద‌గ్గ‌ర ట్యూష‌న్ మాత్రం చెప్పించుకున్నారు. అంటే, దేశంలోని ఏ స్టార్‌తో కంపేర్ చేసినా, అతి త‌క్కువ చ‌దువు శ్రీ‌దేవిదే.