Read more!

English | Telugu

టాలీవుడ్‌లో మ‌హేశ్‌దే టాప్ ప్లేస్.. సెకండ్ ప్లేస్‌లో అల్లు అర్జున్‌!

 

టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. వారి సినిమాలు హిందీలో డ‌బ్బ‌వ‌డం వ‌ల్ల కావ‌చ్చు, పాన్ ఇండియా రేంజ్‌లో వారి సినిమాలు విడుద‌ల‌వుతుండ‌టం కావ‌చ్చు.. వారి పాపులారిటీ ఎల్ల‌లు దాటుతోంది. ఇది సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రిఫ్లెక్ట్ అవుతోంది. అలా సోష‌ల్ మీడియాలో మోస్ట్ పాపుల‌ర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ ఎవ‌ర‌నే లిస్టును స‌ర్వే కంపెనీ ఆర్‌మాక్స్ మీడియా షేర్ చేసింది. మ‌రోసారి ఆ లిస్టులో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ టాప్‌లో నిలిచాడు.

మ‌హేశ్‌బాబు
దేశంలోని అత్యంత అంద‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుపొందిన మ‌హేశ్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న 'స‌ర్కారువారి పాట' మూవీతో ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు. ఆర్‌మాక్స్ మీడియా మోస్ట్ పాపుల‌ర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ ఆన్ సోష‌ల్ మీడియా లిస్టులో అగ్ర స్థానంలో నిలిచాడు.

అల్లు అర్జున్‌
సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' పార్ట్ 1తో డిసెంబ‌ర్ 17న ఆడియెన్స్‌ను ప‌ల‌కరించ‌బోతున్న అల్లు అర్జున్‌.. లిస్టులో రెండో స్థానాన్ని ఆక్ర‌మించాడు.

ప్ర‌భాస్‌
పాన్ ఇండియా స్టార్‌గా నీరాజ‌నాలు అందుకుంటున్న ప్ర‌భాస్ మూడో స్థానంలో నిలిచాడు. వ‌రుస‌గా రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ మూవీస్‌ను అత‌ను చేస్తున్నాడు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌
అత్యంత పాపులారిటీ క‌లిగిన సౌత్ ఇండియ‌న్ స్టార్స్‌లో ఒక‌రైన ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ 2022 జ‌న‌వ‌రి 12న 'భీమ్లా నాయ‌క్‌'గా ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నారు. లిస్ట్‌లో ఆయ‌న‌ది నాలుగో స్థానం.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌
యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు లిస్టులో ఐదో స్థానం ల‌భించింది. రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్‌'తో 2022 జ‌న‌వ‌రి 7న మ‌న‌ముందుకు రాబోతున్నాడు.

రామ్‌చ‌ర‌ణ్‌
'ఆర్ఆర్‌ఆర్‌'లో స‌హ న‌టుడైన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మెగాప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ అనుస‌రిస్తున్నాడు. లిస్టులో అతనిది ఆరో స్థానం.

నాని
నాచుర‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నానికి లిస్టులో ఏడో స్థానం ల‌భించ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. డిసెంబ‌ర్ 24న 'శ్యామ్ సింగ రాయ్‌'గా అత‌ను ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌
స్వ‌ల్ప‌కాలంలోనే అనూహ్య‌మైన పాపులారిటీ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చే ఏడాది 'లైగ‌ర్‌'గా రాబోతున్నాడు. లిస్టులో అత‌నికి 8వ స్థానం ద‌క్కింది.

నాగ‌చైత‌న్య‌
'ల‌వ్ స్టోరి' మూవీతో ఇటీవ‌లే ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న నాగ‌చైత‌న్య‌కు లిస్టులో తొమ్మిదో స్థానం ల‌భించింది.

చిరంజీవి
టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా రెండు ద‌శాబ్దాలు తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి ఈ లిస్టులో ప‌దో స్థానం ద‌క్కించుకున్నారు. త్వ‌ర‌లో 'ఆచార్య‌'గా ఆయ‌న ఫ్యాన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు.