Read more!

English | Telugu

చెల్లెలు చ‌నిపోయింద‌ని తెలీక ఒళ్లో కూర్చోపెట్టుకొని పాలుప‌ట్టిన హీరోయిన్‌!

 

న‌టి కె.ఆర్‌. విజ‌య కేర‌ళ న‌టో, లేదా త‌మిళ న‌టో అనుకుంటారు కానీ, అందులో సగం నిజ‌మే ఉంది. ఎందుకంటే ఆమె తండ్రి తెలుగాయ‌నే. ఆమె తండ్రి రామ‌చంద్ర‌న్‌ది చిత్తూరు. త‌ల్లి మ‌ల‌యాళీ. రామ‌చంద్ర‌న్ మిల‌ట‌రీలో ప‌నిచేసేవారు. ఒక స‌హోద్యోగితో కేర‌ళ వెళ్లిన‌ప్పుడు అక్క‌డ‌, అత‌ని చెల్లిని చూసి ఇష్ట‌ప‌డ్డారు. పెద్ద‌లు ఒప్పుకోవ‌డంతో వారి పెళ్లి జ‌రిగింది. కె.ఆర్‌. విజ‌య అస‌లు పేరు దైవ‌నాయ‌కి. ప‌ద‌కొండేళ్ల వ‌య‌సులోనే ఆమె స్టేజి నాట‌కాలు ఆడ్డం ప్రారంభించారు. 'క‌ర్ప‌గం' అనే త‌మిళ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై 'న‌వ్వుల రారాణి' అనే బిరుదు సంపాదించేశారు విజ‌య‌. ఏకంగా నంద‌మూరి తార‌క‌రామారావు స‌ర‌స‌న 'శ్రీ‌కృష్ణ పాండ‌వీయం'లో రుక్మిణిగా న‌టించడం ద్వారా తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టారు. అప్ప‌ట్నుంచీ ఆమె హీరోయిన్‌గా చాలా కాలం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. కాస్త వ‌య‌సు మ‌ళ్లాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారినా, దేవ‌త పాత్ర‌ల‌తో ఆమె ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా కొన‌సాగారు.

అలాంటి ఆమె జీవితంలో చిన్న‌ప్పుడు జ‌రిగిన ఓ విషాద ఘ‌ట‌న ఆమెను ఇప్ప‌టికీ అమితంగా బాధ‌పెడుతూనే ఉంటుంది. చెల్లెలు చ‌నిపోయింద‌ని తెలీక ఒళ్లో కూర్చోపెట్టుకొని పాలుప‌ట్టిన ఘ‌ట్ట‌మ‌ది! అవును. ఇది సినిమా స‌న్నివేశం కాదు. నిజ జీవితంలో నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌! ఆ రోజు ఆమె చెల్లెలికి ఒంట్లో బాగాలేదు. అమ్మ‌కు కూడా అప్పుడు అనారోగ్య‌మే. చెల్లికి మందు తీసుకు రావ‌డం కోసం మూడు మైళ్ల దూరంలో ఉన్న డాక్ట‌ర్ ఇంటికి ప‌రిగెత్తుకుంటూ వెళ్లారు విజ‌య‌. రొప్పుతూ "ఒంట్లో బాగాలేదు" అని కంగారు కంగారుగా చెప్పారు. ఎవ‌రికి బాగాలేదో, ఎలా వివ‌రించాలో తెలీని చిన్న వ‌య‌సు ఆమెది. డాక్ట‌ర్ అశ్ర‌ద్ధ‌గా ఉంటూ ఆమె ఒంట్లో బాగా లేద‌ని చెప్పింది వాళ్ల‌మ్మ‌గారికి అనుకొని, "స‌రే.. నేనొచ్చి చూసుకుంటాలే" అన్నారు తేలిగ్గా. ఆల‌స్యంగా వ‌చ్చినా త‌న మందులు వేగంగా ప‌నిచేస్తాయ‌ని ఆయ‌న న‌మ్మ‌కం అయివుంటుంది. Also read: ప్ర‌కాశ్‌రాజ్ డైలాగ్ డెలీవ‌రీ చూసి బాల‌చంద‌ర్ ఏం చేశారంటే..!

ఇంటికి వ‌చ్చారు విజ‌య‌. చెల్లెల్ని ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. అమాయ‌కంగా క‌ళ్లు మూసుకొని ఉంది చెల్లెలు. పాలు ప‌డ‌దామ‌ని బుడ్డి తీసి ప‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. చెల్లిలో ఏ క‌ద‌లికా లేక‌పోవ‌డంతో నిద్ర‌పోతోంది కాబోలు అనుకున్నారు. ఇంత‌లో పెద్ద‌వాళ్లు వ‌చ్చారు. విజ‌య పాలు ప‌ట్ట‌డ‌మూ, అవి చెల్లెలి నోట్లోంచి క్రింద‌ప‌డిపోతూ ఉండ‌టం చూశారు. ద‌గ్గ‌ర‌కొచ్చి చూసి గొల్లుమ‌న్నారు. అప్పుడే విజ‌య‌కు తెలిసింది.. చ‌నిపోయిన చెల్లెలికి పాలు ప‌డుతున్నాన‌ని! Also read: ​పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా?

ఆరోజు త‌న చెల్లెలు తొడుక్కున్న చొక్కాను చాలా కాలం భ‌ద్రంగా దాచుకున్నారు విజ‌య‌. దానిని అప్పుడ‌ప్పుడూ చూసుకుంటూ అందులో త‌న చెల్లెల్ని ఊహించుకుంటూ వ‌చ్చారు. "ఆరోజు స‌మ‌యానికి వైద్య స‌హాయం ల‌భించివుంటే నా చెల్లెలు బ‌తికి ఉండేదేమో.. కానీ ఆ స్థోమ‌త అప్పుడు లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ పోయిన చెల్లెలు తిరిగిరాదు, రాలేదు." అని త‌న జ్ఞాప‌కాల‌లో రాసుకున్నారు కె.ఆర్‌. విజ‌య‌.