Read more!

English | Telugu

నాగ‌బాబు దృష్టిలో చిరు చేసిన అలాంటి రిస్కీ ఫైట్‌ను మ‌రే హీరో చేయలేదు!

 

చిరంజీవిలో నాగ‌బాబుకు న‌చ్చ‌ని గుణం ఒక‌టుంది. అది.. తెగింపు! అవును. సినిమాల్లో ఫైట్స్ విష‌యంలో చిరు చేసే రిస్కుకు మెగా బ్ర‌ద‌ర్‌కు కోపం వ‌చ్చేస్తుంది. ఈ విష‌య‌మై ఒక‌సారి ఆయ‌న అన్న‌య్య‌తో గొడ‌వ ప‌డ్డారు కూడా. కానీ చిరు లెక్క‌చేస్తే క‌దా! నాగ‌బాబుకు ఇప్ప‌టికీ ఆ స‌న్నివేశం బాగా గుర్తు. హోట‌ల్ అట్లాంటిక్ పైభాగాన మూడున్న‌ర అడుగుల వెడ‌ల్పు ఉన్న చిన్న‌గోడ మీద ఫైట్‌. కానీ దాన్ని స‌ద‌రు సినిమాలో డైరెక్ట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌రిగా ఎస్టాబ్లిష్ చేయ‌లేక‌పోయారు. 

దాదాపు పదంత‌స్తుల ఆ హోట‌ల్ పిట్ట‌గోడ మీద ఫైట్ అంటే.. ఊహించ‌డానికే క‌ష్టం! అది చూసి నాగ‌బాబుకు టెన్ష‌న్‌, భ‌యం. చూడ‌లేక ఇంటికెళ్లిపోయి వాళ్ల నాన్న‌గారితో దెబ్బ‌లాడారు. చిరు వంటిని ప‌రిశీలిస్తే గాయాల తాలూకు మ‌చ్చ‌లెన్నో క‌నిపిస్తాయి. అదృష్టం ఏమంటే ఎన్ని ప్రాణాంత‌క ఫైట్స్ చేసినా చిరుకు ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. కానీ, 'సంఘ‌ర్ష‌ణ' సినిమాలో ఒక చిన్న ఫైట్‌కు దెబ్బ త‌గిలింది.

Also read: 'ల‌క్ష్య' మూవీ రివ్యూ

ఫైట్స్ విష‌యంలో అన్న‌య్య‌తో దెబ్బ‌లాడే నాగ‌బాబు, సొంత చిత్రం 'త్రినేత్రుడు'లోని భ‌యంక‌ర‌మైన గ్లోబ్ ఫైట్‌ను వ్య‌తిరేకించ‌లేక‌పోయారు. "నాకు తెలిసి తెలుగు సినిమా హీరోల్లో ఎవ‌రూ అంత రిస్క్ ఫైట్ చేయ‌లేదు. ఈ ఫైట్‌ను ఆరు రోజుల పాటు తీశాం. ఆ ఫైట్ త‌ర్వాత నిర్ణ‌యించుకున్నా, క‌నీసం మా సినిమాల్లో అయినా అలాంటి రిస్క్ ఫైట్స్‌ను ఇక చెయ్య‌కూడ‌ద‌ని." అని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు నాగ‌బాబు.

Also read:  చాన్నాళ్ళ త‌రువాత ఆ పాత్ర‌లో చిరు!

చిరు చేసిన చిత్రాల్లో 'పున్న‌మినాగు' అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. "అందులోని పాత్ర‌ను ఇప్ప‌టికీ మ‌రువ‌లేను. అందులో యాంటీ హీరోగా అన్న‌య్య అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ త‌ర్వాత 'జ్వాల‌', 'ర‌క్త‌సిందూరం' సినిమాల్లోనూ బ్యూటిఫుల్ పాత్ర‌లు చేశారు. అలాంటి పాత్ర‌లు అన్న‌య్య మ‌ళ్లీ చెయ్య‌లేదు." అని నాగ‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.