English | Telugu
టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా నిలిచిన.. చైతూ, సామ్ పోరుకి ఐదేళ్ళు!
Updated : Sep 12, 2023
తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో నాగచైతన్య, సమంతది ప్రత్యేక స్థానం. 'ఏ మాయ చేసావె' వంటి విజయవంతమైన సినిమాతో మొదలైన ఈ హిట్ పెయిర్ జర్నీ.. ఆపై 'మనం', 'ఆటోనగర్ సూర్య', 'మజిలీ' వరకు సాగింది. వీటిలో ఆటోనగర్ సూర్య మినహా మిగిలిన చిత్రాలన్నీ విజయపథంలో పయనించాయి. ఇక మజిలీ కంటే ముందే రియల్ లైఫ్ దంపతులైన చైతూ, సామ్ .. పెళ్ళయ్యాక 2018లో ఒకే రోజు వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్ ముంగిట పోటీ పడ్డారు.
ఆ వివరాల్లోకి వెళితే.. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' 2018 సెప్టెంబర్ 13న జనం ముందు నిలిచింది. కట్ చేస్తే.. అదే రోజు సమంత హీరోయిన్ గా పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూటర్న్' కూడా రిలీజైంది. ఇలా భార్యాభర్తలైన చైతూ, సామ్ ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగడం అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. అయితే, వీటిలో శైలజా రెడ్డి అల్లుడు ఓపెనింగ్స్ బాగానే రాబట్టుకున్నప్పటికీ తరువాత రాణించలేకపోయింది. ఇక యూటర్న్ విషయానికి వస్తే.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఏదేమైనా.. చైతూ, సామ్ బాక్సాఫీస్ వార్ కి ఈ బుధవారం(సెప్టెంబర్ 13)తో ఐదేళ్ళు పూర్తవుతున్నాయి.
