English | Telugu
షారుఖ్ కి బెదిరింపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Updated : Oct 9, 2023
'పఠాన్', 'జవాన్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరి ఫుల్ జోష్ లో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి బెదిరింపులు ఎక్కువయ్యాయి. షారుఖ్ ని చంపేస్తామంటూ ముంబైలోని ఆయన నివాసానికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి లేఖలు వస్తున్నాయి. దీంతో షారుఖ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనకు వై ప్లస్ భద్రతను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
'పఠాన్' సినిమాలోని 'బేషరమ్ రంగ్' సాంగ్ లో దీపికా పదుకొనే కాషాయ బికినీ ధరించడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 'పఠాన్' సినిమాని అడ్డుకుంటామని, చంపేస్తామని అప్పుడు షారుఖ్ కి బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను కల్పించింది. అయితే ఇటీవల మళ్ళీ బెదిరింపులు తీవ్ర తరం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆరుగురు సిబ్బంది మూడు షిఫ్టుల్లో షారుఖ్ కి భద్రత కల్పించనున్నారు.