Read more!

English | Telugu

'దోస్తానా 2'లో కార్తిక్ ఆర్య‌న్ ఎందుకు న‌టించ‌లేదంటే ?

కార్తిక్ ఆర్యన్ దోస్తానా 2 నుంచి వైదొలగడానికి గల రీజన్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. కరణ్ జోహార్ తెరకెక్కించాలనుకున్న సినిమా దోస్తానా 2.  ఈ సినిమాలో కార్తిక్ ఆర్య‌న్‌ని హీరోగా సెలెక్ట్ చేశారు కరణ్ జోహార్.  ఉన్న‌ప‌ళంగా రెమ్యున‌రేష‌న్‌ని పెంచి, కార్తిక్ అన్‌ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి అప్పట్లో కార్తిక్ ఆర్య‌న్‌ అసలు నోరు విప్పలేదు. కానీ ఇటీవల ఆ కాంట్రవర్సీకి సంబంధించి మాట్లాడారు కార్తిక్. 

దోస్తానా 2 విషయంలో ఏం జరిగిందో తన వంతు వాదనను వినిపించారు.  ఆప్ కి అదాలత్ అనే షోలో కార్తీక్ మాట్లాడుతూ ``ఇది ఎప్పుడో జరిగిన విషయం. నేను ఇప్పటిదాకా దీని గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. నాకు మా అమ్మ చాలా విలువలు నేర్పారు. ఆ విలువల మీద నాకు గౌరవం ఉంది ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చిన్నవాళ్లు దాని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు... అని మా అమ్మ చాలాసార్లు చెప్పారు. అందుకే నేను ఇప్పటి దాకా దాని గురించి మాట్లాడలేదు`` అని అన్నారు. 

పారితోషికం పెంచకపోవడం వల్లనే ఈ ప్రాజెక్టు నుంచి మీరు తప్పుకున్నారట కదా అని ప్రశ్నను కార్తిక్ ముందు ఉంచినప్పుడు,  వ్యంగ్యంగా స్పందించారు. ``తాను ఎప్పుడూ డబ్బు కోసం ప్రాజెక్టులు వదులుకోలేదని తాను స్వార్థపరుడినే కానీ, అది స్క్రిప్ట్ విషయంలో మాత్రమేనని.. డబ్బులు విషయంలో కాదని`` స్పష్టం చేశారు. ఇదేదో చైనీస్ విష్పర్ లాగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించారు. క‌ర‌ణ్ జోహార్ తో ఈ గొడవ జరిగి దాదాపు ఏడాదిన్నర అయిందని, ఇప్పుడు కర‌ణ్‌ కి తనకి మధ్య అంతా సవ్యంగా ఉందని చెప్పారు కార్తీక్ ఆర్యన్ . షెహ్‌జాదా సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో కరణ్ జోహార్ తనను పొగడ్తలతో ముంచేశారని, తనకు శుభాకాంక్షలు చెప్పారని కూడా కార్తీక్ అన్నారు. ప్రస్తుతం కార్తీక్ షెహ్‌జాదా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆషుకి 3 సినిమాకు కూడా ఆయన సంతకం చేశారు.