English | Telugu
పార్టీలో అమీషా ఎక్స్‌పోజింగ్.. దుపట్టా కప్పిన సంజయ్ దత్!
Updated : Jul 13, 2021
ఆడవాళ్ల డ్రస్ కోడ్ గురించి చాలా కాలంగా చాలా రకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. తాము ఎక్కడ ఏ డ్రస్ వేసుకోవాలనేది తమ ఇష్టమనీ, దాన్ని నిర్దేశించడానికి మిగతావాళ్లు ఎవరనీ స్త్రీలు బాహాటంగా ఎలుగెత్తుతున్నారు. 'బద్రి', 'నాని' సినిమాల హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇక్కడ ఆమె డ్రస్ గురించి పట్టించుకున్నది సాక్షాత్తూ.. స్టార్ యాక్టర్ సంజయ్ దత్. మరో స్టార్ హీరో వరుణ్ ధావన్ అన్న రోహిత్ ధావన్ సంగీత్ వేడుక కొన్నేళ్ల క్రితం గోవాలో జరిగింది. దానికి భార్య మాన్యతతో కలిసి హాజరయ్యాడు సంజయ్. అతిథుల్లో అమీషా కూడా ఉంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ఆ వేడుకకు అమీషా 'చానియా-చోళీ' ధరించి వచ్చింది. అది ఆమె ఛాతీభాగాన్ని బహిర్గతం చేస్తోంది. దత్ ఫ్యామిలీకి అమీషా మంచి ఫ్రెండ్. సంజయ్‌తో కలిసి కొన్ని సినిమాలు చేసింది అమీషా. ఆమె డ్రస్ చూసిన సంజయ్, క్లీవేజ్ కనిపించకుండా డ్రస్ సరిచేసుకొమ్మని చెప్పాడు. అంతేకాదు, ఒకడుగు ముందుకువేసి, ఆమె దుపట్టాని చేతుల్లోకి తీసుకొని, వక్షస్థలం కనిపించకుండా, దాన్ని ఆమె భుజం చుట్టూ కప్పాడు. సంజయ్ చేసిన పని అమీషాకు ఏమాత్రం నచ్చలేదు.
ఆ రిపోర్ట్ నిజమే అయితే, సంజయ్ చర్య ఆమెకు కోపం తెప్పించింది. తనెలా డ్రస్ చేసుకోవాలో నువ్వెలా చెబుతావంటూ అతడిని ప్రశ్నించింది. ఇండస్ట్రీ అంతర్గత వర్గాలు వెల్లడించిన దాని ప్రకారం, సంజు చాలా సంప్రదాయ భావాలు కలిగిన వ్యక్తి. అతను తమ అందాలు బహిర్గతమయ్యేలా ఆడవాళ్లు డ్రస్ చేసుకోవడాన్ని ఇష్టపడడు. అమీషా తనకు సోదరి లాంటిదనీ, అలాంటి దుస్తులు ధరించకూడదనీ మర్యాదపూర్వకంగా ఆమెకు చెప్పాడు. ఒంటిమీద ఒక పక్కకు జరిగిపోయి ఉన్న దుపట్టాను పట్టుకొని, ఆమె వక్షస్థలం కనిపించకుండా దాన్ని చుట్టాడు.
"దాన్ని ఆమె ఓ సమస్యగా చూస్తుందని అతనెప్పుడూ ఊహించలేదు. కానీ అమీషా పెద్దగా అరుస్తూ, అలాంటి పని చెయ్యడానికి నువ్వెవరంటూ సంజయ్‌పై కేకలు వేసింది. సంజు మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి తప్పుకున్నాడు. ఆ మరుసటి రోజు అతను ముంబైకి వెళ్లిపోయాడు." అని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఆ టైమ్‌లో అక్కడున్నవాళ్లు పరిస్థితిని చక్కబరచడానికి ప్రయత్నించారు కానీ అమీషా ఎవరినీ పట్టించుకోలేదు. అయితే దానికి పర్యవసానాలు వెంటనే చోటు చేసుకున్నాయి. సంజయ్ దత్ నటిస్తోన్న రెండు సినిమాల నుంచి ఆమెను తొలగించారు. ఆమెతో నటించడానికి అతను ఇష్టపడకపోవడమే దీనికి కారణం. వాటిలో ఒకటి డేవిడ్ ధావన్ సినిమా అయితే, మరొకటి ప్రియదర్శన్ మూవీ.
వ్యవహారం రివర్స్ అవడంతో, బయట ప్రచారంలోకి వచ్చినట్లుగా సంగీత్ వేడుకలో అలాంటిదేమీ జరగలేదనీ, సంజయ్ దత్ తన విషయంలో ఎప్పుడూ ప్రొటెక్టివ్‌గా ఉంటూ వచ్చాడనీ చెప్పింది అమీషా. "సంజు నా విషయంలో చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటాడు. అతను నాకు డియర్ ఫ్రెండ్. ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించడు. ఎవరైనా నన్ను తాకడానికి ట్రై చేస్తే వాళ్లను సంజు చంపేస్తాడు. ఆఖరుకి నామీద ఈగకూడా వాలనివ్వడు. అతను నాతో మిస్‌బిహేవ్ చేశాడనే వదంతులు పూర్తిగా నాన్సెన్స్. అవి అసూయాపరులు సృష్టించినవి." అని అమీషా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసుకొచ్చింది.
అయితే ఆ తర్వాత అమీషా ఎంత ప్రయత్నించినా ఆమె కెరీర్ ఆశించిన రీతిలో సాగలేదు. స్టార్ హీరోలెవరూ ఆమెను తమ పక్కన తీసుకోలేదు. ప్రస్తుతం అమీషా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే.. రోజూ ఎక్స్‌పోజింగ్ వీడియోలు, ఫొటోలే! అందాల ప్రదర్శనే!!
