English | Telugu
ఫస్ట్ టైమ్ ఆలియాతో హృతిక్ రొమాన్స్!
Updated : Jul 13, 2021
బాలీవుడ్ కండల వీరుడు హృతిక రోషన్ గత కొంతకాలంగా ఫ్రెష్ జోడీలపైనే ఫోకస్ పెడుతున్నాడు. 'మొహెంజోదారో' (2016)లో పూజా హెగ్డే, 'కాబిల్'(2017)లో యామీ గౌతమ్, 'సూపర్ 30' (2019)లో మృణాల్ ఠాకూర్, 'వార్'(2019)లో వాణీ కపూర్ తో ఫస్ట్ టైమ్ రొమాన్స్ చేసిన హృతిక్.. త్వరలో 'ఫైటర్' కోసం దీపికా పడుకోనేతో తొలిసారిగా జోడీ కట్టనున్నాడు. అంతేకాదు.. 'ఫైటర్' తరువాత చేయబోయే చిత్రాల్లోనూ ఇదే శైలిని కొనసాగించబోతున్నట్లు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. 'గుజారిష్' (2010) తరువాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో హృతిక్ ఓ సినిమా చేయబోతున్నారని టాక్. అందులో హృతిక్ కి జంటగా ఆలియా భట్ కనిపించనుందని బాలీవుడ్ ఖబర్. వాస్తవానికి 'ఇన్షల్లా' పేరుతో ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేశారు భన్సాలీ. అయితే, కొన్ని కారణాల వల్ల సల్మాన్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. హృతిక్ తో సెట్ చేశారట.
అయితే, కథానాయికగా మాత్రం మొదట ప్రకటించిన ఆలియానే కొనసాగుతుందని వినికిడి. త్వరలోనే హృతిక్, ఆలియా ఫస్ట్ కాంబినేషన్ పై క్లారిటీ రానుంది. కాగా 'ఫైటర్', 'ఇన్షల్లా' మధ్యలో 'విక్రమ్ వేద' రీమేక్ తో పలకరించబోతున్నాడు హృతిక్. అలాగే ఈ చిత్రాల తరువాత 'క్రిష్ 4'తో సందడి చేయనున్నాడనేది బజ్.
