English | Telugu

ఆమిర్ ఖాన్‌తో ఒక్క డైలాగ్ చెప్ప‌డానికి 19 టేకులు తీసుకున్న ఐశ్వ‌ర్య‌!

ఆమిర్ ఖాన్‌తో ఒక్క డైలాగ్ చెప్ప‌డానికి 19 టేకులు తీసుకున్న ఐశ్వ‌ర్య‌!

 

ఐశ్వ‌ర్యా రాయ్ ముంబైలోని జైహింద్‌, రూపారెల్ కాలేజీల్లో ఇంట‌ర్మీడియేట్ చ‌దివారు. బ‌యాల‌జీ, జువాల‌జీ ఆమెకు ఇష్ట‌మైన స‌బ్జెక్టులు. అందుక‌నే ఇంట‌ర్మీడియేట్‌లో బైపీసీ గ్రూప్ తీసుకున్నారు. అలాగ‌ని డాక్ట‌ర్ అవ్వాల‌ని మాత్రం అనుకోలేదు. అలాంటి వృత్తిలోకి అడుగుపెట్టాలంటే ఎంతో అంకితభావం కావాలి. ఆ రోజుల్లో ఐశ్వ‌ర్య‌కు అంత డెడికేష‌న్ ఉండేది కాదు. ఆ విష‌యం తెలుసు కాబ‌ట్టే ఎప్పుడూ ఆ దిశ‌గా ఆమె ఆలోచించ‌లేదు. త‌ర్వాత డిగ్రీలో బీఆర్క్‌లో చేరారు.

ఇంట‌ర్ సెకండియ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు ఆమె ఇంగ్లిష్ ప్రొఫెస‌ర్ వ‌చ్చి "ఒక మేగ‌జైన్ ఫీచ‌ర్‌కు మోడ‌ల్‌గా చేస్తావా?" అని అడిగారు. ఆమె ఫొటోజ‌ర్న‌లిస్ట్ కూడా. ఐశ్వ‌ర్య జీవితంలో వ‌చ్చిన తొలి మోడ‌లింగ్ ఆఫ‌ర్ అది. మొద‌ట్లో సంకోచించారు. కానీ ప్రొఫెస‌ర్ ఎన్నోవిధాల చెప్పి ఆమెను ఒప్పించారు. ఆమె తొలి మేక‌ప్‌మ్యాన్ భ‌ర‌త్ గొడాంబే. ఆయ‌న ఐశ్వ‌ర్య‌ను చూసి మోడ‌లింగ్ ఇండ‌స్ట్రీలో అంద‌రికీ చెప్పేశారు. ఒక‌ట్రెండు రోజుల్లోనే ఆమె గురించి ఇండ‌స్ట్రీ మొత్తానికి తెలిసిపోయింది. వెంట‌నే వ‌రుస‌పెట్టి అవ‌కాశాలు వ‌చ్చాయి.

ఐశ్వ‌ర్య మొద‌ట ప‌నిచేసింది ఒక టాల్క‌మ్ పౌడ‌ర్ యాడ్‌కు. త‌ర్వాత పెప్సీ యాడ్‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు. ఆ యాడ్‌లో ఆమిర్ ఖాన్‌తో ఐశ్వ‌ర్య చెప్పిన‌ "హాయ్‌.. అయామ్ సంజూ" అనే డైలాగ్‌ను అభిమానులు ఇప్ప‌టికీ గుర్తుచేస్తూనే ఉంటారు. ఆ డైలాగ్ చెప్ప‌డానికి ఐశ్వ‌ర్య‌కు ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 19 టేకులు తీసుకున్నారు! ఇది నిజంగా నిజం.