English | Telugu

సీక్వెల్ బాట‌లో 'వార్'!

బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో `వార్` ఒకటి. యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ తో క‌లిసి హృతిక్ న‌టించిన ఈ మ‌ల్టిస్టార‌ర్.. 2019 గాంధీ జ‌యంతికి విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. సిద్ధార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ రాజ్ ఫిల్మ్స్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఇటీవ‌లే రెండేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ నేప‌థ్యంలో.. `వార్` సీక్వెల్ గురించి తీపి క‌బురు చెప్పారు ద‌ర్శ‌కుడు సిద్ధార్ధ్ ఆనంద్.

`వార్` హిట్ అయితే కొన‌సాగింపుగా `వార్ 2` చేయాల‌ని ఆదిత్య‌, త‌ను ముందే నిర్ణ‌యించుకున్నామ‌ని.. దానికి త‌గ్గ‌ట్టే సీక్వెల్ ఐడియా ప్లాన్ చేశామ‌ని చెప్పారు సిద్ధార్ధ్. అదేవిధంగా, `వార్ 2` సీక్వెల్ ఓ పెద్ద బాధ్య‌త అని.. `వార్`ని మించేలా చాలా క‌స‌ర‌త్తులే చేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాఫ్ ఈ సీక్వెల్ లోనూ కొన‌సాగుతార‌ని.. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే వ‌చ్చే సంవ‌త్స‌రం `వార్ 2` సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని సిద్ధార్ధ్ ఆనంద్ చెప్పుకొచ్చారు. మ‌రి.. `వార్`లాగే `వార్ 2` కూడా బాక్సాఫీస్ సెన్సేష‌న్ గా నిలుస్తుందేమో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.