English | Telugu
‘వార్ 2’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..అదే అసలు విషయం
Updated : Oct 27, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఆయన బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ వంటి ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాతో గ్లోబల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తారక్ ఇప్పుడు తొలిసారిగా వార్ 2 మూవీ ద్వారా బాలీవుడ్ మేకర్స్‌తో కలిసి పనిచేయబోతున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయమొకటి బయటకు వచ్చింది.
అదేంటంటే వార్ 2 ఫస్ట్ షెడ్యూల్‌ను స్పెయిన్‌లో కంప్లీట్ చేశారని. అదేంటి ఇటు హృతిక్ రోషన్, అటు ఎన్టీఆర్ ఎవరూ షూటింగ్‌లో పాల్గొనకుండానే షూటింగ్‌ను ఎలా పూర్తి చేశారనే అనుమానం రాక మానదు. అసలు విషయమేమంటే స్పెయిన్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. ఇందులో బాడీ డబుల్స్‌ను పెట్టి చిత్రీకరణ చేశారట మేకర్స్. ఇందులో అసలు నటీనటులు పాల్గొనాల్సిన పని లేకపోవటంతో దర్శక నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వార్ సినిమాకు కంటిన్యూగా వార్ 2ను రూపొందిస్తున్నారు. వార్ పార్ట్ వన్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో మెప్పించబోతున్నారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగంగా వార్ 2 సినిమా ఉంటుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. వార్ 2లో కియారా అద్వాని హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ చిత్రంలో నటించటానికి ఎన్టీఆర్ ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగానే రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారని సమాచారం.