Read more!

English | Telugu

బీచ్‌కి ఎవరూ ఫుల్ డ్రెస్‌తో వెళ్లరని చెప్పిన 'బేషరం రంగ్‌' కొరియోగ్రాఫర్!


"బీచ్‌కి ఎవరూ ఫుల్ డ్రెస్‌తో వెళ్ళరు" అని అన్నారు 'పఠాన్‌'లోని "బేషరం రంగ్‌" సాంగ్ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్. యష్‌రాజ్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్‌తోతో మాట్లాడిన వైభవి.. 'బేషరం'  పాట గురించి, కంపోజ్ చేసిన విధానం గురించి చాలా విషయాలను పంచుకున్నారు. టిపికల్ హిందీ ఫిలిం బీచ్ పార్టీ పాటలాగా 'బేషరం' ఉండకూడదని ముందే అనుకున్నట్టు తెలిపారు. లాజికల్ గా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిసినప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ కుదురుతుందని.. అంతేగాని.. కలిశామా, స్టెప్పులు వేశామా అన్నట్టు ఉండదని.. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు.

షారుక్ ఖాన్ షర్ట్ లేకుండా వాక్ చేయడం గురించి కూడా ఆమె స్పందించారు. బీచ్‌కి ఎవరు పూర్తి దుస్తులతో వెళ్లరని అన్నారు. దీపిక గురించి మాట్లాడుతూ, ఆమె సైలెంట్ వర్కర్ అని అన్నారు. తన పని తాను చేసుకుపోతారని, ఆమెతో పనిచేసిన రోజులు ప్రశాంతంగా ఉంటాయని తెలిపారు. రిహార్సల్స్ చేయడానికి ఎప్పుడూ వెనకాడరని అన్నారు. ఆమెకి పాట పట్ల, పాటకి కంపోజ్‌ చేసిన నృత్యం పట్ల ఉన్న అవగాహన, విజన్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదని అన్నారు. అలాగని తనకు తెలిసిన విషయాన్ని పదిమందితో చెప్పి డప్పు వాయించుకోవాలని అనుకోర‌ని, సైలెంట్‌గా పనిచేసుకుని వెళ్లిపోతారని అన్నారు. తన పని పట్ల పూర్తి నిబద్ధత, అవగాహన ఉన్న నటి దీపికా పదుకొనే అని తెలిపారు వైభవీ.

షారుక్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి నటించిన సినిమా 'పఠాన్'. జనవరి 25న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను య‌ష్‌రాజ్‌  ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తోంది. దాదాపు నాలుగున్నర ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన పూర్తిస్థాయి సినిమా 'పఠాన్'.