Read more!

English | Telugu

ఫేవరేట్‌ కపూర్‌ స్టార్‌ గురించి చెప్పిన శ్రద్ధా!

శ్రద్ధాకపూర్‌ గురించి నార్త్ వాళ్లకు ఎంత తెలుసో, సౌత్‌ వాళ్లకు కూడా అంతే తెలుసు. ఎంతైనా డార్లింగ్‌ తో సినిమా చేసిన బ్యూటీ కదా. సాహోలో డార్లింగ్‌ ప్రభాస్‌ పక్కన జోడీ కట్టారు శ్రద్ధాకపూర్‌. ఆ సినిమాలోని సన్నివేశాలు, పాటలను ఇప్పటికీ ఇష్టంగా గుర్తుచేసుకుంటారు డార్లింగ్‌ ఫ్యాన్స్. 

అందుకే మనకు శ్రద్ధాకపూర్‌ మీద ఎప్పుడూ మనవారికి ఇంట్రస్ట్ ఉంటూనే ఉంటుంది. లేటెస్ట్‌గా తూ ఝూతీ మే మక్కర్‌ సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధా కపూర్‌. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. రణ్‌బీర్‌, శ్రద్ధ బీచ్‌ సాంగ్‌కి సూపర్‌డూపర్‌ రెస్పాన్స్ వస్తోంది. శ్రద్ధ దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ మీదకు రావడానికి రెడీ అవుతున్నారు కాబట్టి, కాసింత ఎక్కువగానే గ్లామర్‌ షో చేశారనే మాటలున్నాయి. లవ్‌రంజన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో పార్టిసిపేట్‌ చేశారు శ్రద్ధ. 

నచ్చిన కపూర్‌ హీరో ఎవరనే ప్రశ్న ఎదురైంది శ్రద్ధకు. అందరూ రణ్‌బీర్‌ కపూర్‌ పేరు చెబుతారని ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే అందుకు మారుగా సమాధానం ఇచ్చారు శ్రద్ధ. ''నాకు మా నాన్న శక్తి కపూర్‌ అంటే ఇష్టం. ఏ అమ్మాయికైనా ఫస్ట్ హీరో నాన్నే. నేను అలా చెప్పడం లేదు. మా నాన్న యాక్టింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చెప్పాను'' అని అన్నారు. లవ్‌రంజన్‌ సినిమా కోసం చాన్నాళ్లుగా వెయిట్‌ చేస్తున్నానని అన్నారు. ఫ్యాన్స్ కి తన తరఫున ఇచ్చే పర్ఫెక్ట్ ట్రీట్‌ ఇదేనని చెప్పారు శ్రద్ధా కపూర్‌.