English | Telugu
పేరెంట్స్‌కు 8 బెడ్‌రూమ్ ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన టైగర్!
Updated : Sep 5, 2021
బాలీవుడ్‌లోని యంగర్ జనరేషన్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ యాక్టర్స్‌లో టైగర్ ష్రాఫ్ ఒకడు. అతని ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ. సూపర్‌స్టార్‌కు కావాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయనిపిస్తుంది. 'హీరోపంతి' లాంటి సక్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను 'బాఘి', 'బాఘి 2', 'వార్' లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించాడు. అమ్మానాన్నలు ఆయేషా ష్రాఫ్, జాకీ ష్రాఫ్‌లతో అతని అనుబంధం చాలా గట్టిది.
ఇటీవల టైగర్ ష్రాఫ్ ముంబైలో ఒక లగ్జరియస్ అపార్ట్‌మెంట్‌ను కొని పేరెంట్స్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడం చాలామంది హృదయాలను టచ్ చేసింది. పేరెంట్స్‌గా జాకీ, ఆయేషా చాలా గర్వపడి వుంటారని చెప్పాల్సిన పనిలేదు. అది 8 బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ కావడం గమనార్హం. నేనిక్కడ ఈ స్థాయిలో ఉన్నానంటే నా పేరెంట్స్ ఆశీర్వాదం వల్లే. ఇంతకంటే బెటర్ ఫ్యామిలీని నేను కోరుకోను. అని చెప్పాడు టైగర్.
ముంబై మహానగరంలోని పాష్ ఏరియాస్‌లో ఒకటైన ఖర్ వెస్ట్‌లో అమ్మానాన్నలకు లగ్జరియస్ ఫ్లాట్‌ను కానుకగా ఇవ్వడాన్ని అతడేమీ గొప్పగా భావించడు. నాకు సంబంధించి ఆ ఇంటి సైజు పెద్ద విషయం కాదు. నా పేరెంట్స్ కోసం ఒక ఇంటిని కొనగలిగానంటే దేవుడి ఆశీర్వాదం వల్లే. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పాడు టైగర్. అతను చేయాలనుకున్న పనుల లిస్టులో పేరెంట్స్‌కు ఇల్లు కొనివ్వాలనేది టాప్‌లో ఉంది. యాక్టర్ కాక మునుపే అతను ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడంట. గ్రేట్!