English | Telugu
నీ న్యూడ్ ఫొటోలు పంపు.. అక్షయ్ కుమార్ కూతురికి అసభ్యకర మెసేజ్ లు!
Updated : Oct 3, 2025
సోషల్ మీడియా గర్ల్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పరిచయంలేని వ్యక్తులు మెసేజ్ లు చేసి ఇబ్బంది పెడుతుంటారు. ఇంకా కొందరైతే పర్సనల్ ఫొటోలు, వీడియోలు పంపమంటూ అసభ్యకర మెసేజ్ లు చేస్తుంటారు. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ కి కూడా ఆ పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని అక్షయ్ కుమారే స్వయంగా పంచుకున్నారు. (Akshay Kumar Daughter)
తాజాగా ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025' కార్యక్రమానికి అక్షయ్ కుమార్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్ లైన్ లో చిన్నారులు వేధింపులకు గురవుతున్నారని అన్నారు. అలాగే, తన కుమార్తె ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
"కొన్ని నెలల క్రితం నా కూతురు ఆన్ లైన్ లో గేమ్ ఆడుతుండగా.. నువ్వు ఆడా, మగా? అని ఓ అపరిచుతుడి నుంచి మెసేజ్ వచ్చింది. నా కూతురు ఫిమేల్ అని రిప్లై ఇవ్వగా.. అతను 'నీ న్యూడ్ ఫొటోలు పంపుతావా?' అంటూ మరో మెసేజ్ చేశాడు. దాంతో వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన మా అమ్మాయి, జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పింది. ఇలాంటి మెసేజ్ లు చేయడం కూడా సైబర్ క్రైమ్ లో భాగమే. దీనిని కట్టడి చేయడం ఎంతో అవసరం." అని అక్షయ్ కుమార్ అన్నారు.