Read more!

English | Telugu

పాండ‌మిక్ టైమ్‌లో 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను క‌లెక్ట్ చేసిన‌ 'స్పైడ‌ర్‌మ్యాన్‌'!

 

సినిమాహాళ్ల మూసివేత‌లు, క‌రోనా మ‌హ‌మ్మారి భ‌యాందోళ‌న‌లు వెన్నాడుతున్నా, గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌టం చూస్తున్నాం. అయితే గ్లోబ‌ల్‌గా నిజ‌మైన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'స్పైడ‌ర్‌మ్యాన్: నో వే హోమ్' రూపంలో వ‌చ్చింది. ఆ సినిమా విడుద‌లైన కేవ‌లం 12 రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది.

Also read: పాము కాటుకు గురైన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్

టామ్ హాలండ్‌, జెందాయా జంట‌గా న‌టించిన ఈ సినిమా ఇప్ప‌టిదాకా 1.05 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. ఈమార్కును వేగ‌వంతంగా అందుకున్న మూడో సినిమాగా అది రికార్డుల‌కెక్కింది. ఇదివ‌ర‌కు 'అవెంజ‌ర్స్: ఇన్‌ఫినిటీ వార్‌', 'అవెంజ‌ర్స్: ఎండ్‌గేమ్' అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్నాయి. 'ఎండ్‌గేమ్' అయితే కేవ‌లం ఐదు రోజుల్లోనే 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలుచేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న సినిమాగా నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచింది.

Also read: పుష్ప‌.. అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన హిందీ వెర్ష‌న్‌!

అయితే చైనాలో రిలీజ్ లేకుండానే 'స్పైడ‌ర్‌మ్యాన్: నో వే హోమ్' ఈ ఫీట్‌ను అందుకోవ‌డం అతి పెద్ద విశేషంగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో రెండో వారం వ‌సూళ్లు భారీ స్థాయిలో త‌గ్గిపోయిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్ప‌టికీ ఈ సినిమా నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లోనే ఉంది. 'ద మ్యాట్రిక్స్ రిస‌ర‌క్ష‌న్స్' నుంచి ఈ మూవీకి కొద్దిపాటి పోటీ ఎదుర‌వుతోంది. కియాను రీవ్స్ మెయిన్ లీడ్‌గా న‌టించిన లేటెస్ట్ 'మ్యాట్రిక్స్' మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 69.8 మిలియ‌న్ డాల‌ర్ల‌ను రాబ‌ట్టింది.