Read more!

English | Telugu

హిందీలో 'రోబో', 'క‌బాలి'ని దాటేసిన 'పుష్ప‌'!

 

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన 'పుష్ప' హిందీ వెర్ష‌న్ నార్త్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హిందీ స్ట్ర‌యిట్ ఫిల్మ్ '83'తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'స్పైడ‌ర్‌మ్యాన్‌'ను మించి క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతోంది. డిసెంబ‌ర్ 17న విడుద‌లైన‌ హిందీ 'పుష్ప' ఇప్ప‌టిదాకా దేశంలో రూ. 39.95 కోట్ల నెట్‌ను సాధించి, అంద‌రి అంచ‌నాల‌నూ త‌ల‌కిందులు చేసేసింది. రెండో వారంలో ఈ సినిమా శుక్ర‌వారం రూ. 2.31 కోట్లు, శ‌నివారం రూ. 3.75 కోట్లు, ఆదివారం రూ. 4.25 కోట్లు, సోమ‌వారం రూ. 2.75 కోట్లు వ‌సూలు చేయ‌డం ఏ ర‌కంగా చూసినా విశేషంగా చెప్తున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.

Also read: పాము కాటుకు గురైన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్ట‌డీగా క‌లెక్ష‌న్లు సాధిస్తోన్న 'పుష్ప', టాప్ 10 హిందీ డ‌బ్బింగ్ మూవీస్ చార్ట్‌లో 6వ‌ స్థానం సంపాదించడం! ఈ క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ 'రోబో' (రూ. 23.84 కోట్లు), 'క‌బాలి' (రూ. 28 కోట్లు) సినిమాలను వెన‌క్కి నెట్టేసింది. ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తుండ‌టంతో రానున్న రోజుల్లో య‌ష్ 'కేజీఎఫ్: చాప్ట‌ర్ 1' హిందీ వెర్ష‌న్‌ను దాటి, ఐదో స్థానానికి ఎగ‌బాక‌నుంది. సెకండ్‌ వీక్ పూర్త‌య్యేనాటికి 'పుష్ప' క‌లెక్ష‌న్లు 'కేజీఎఫ్‌'ను దాటుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. 

టాప్ 10 హిందీ డ‌బ్బింగ్ మూవీస్‌:

బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్ - రూ. 510.99 కోట్లు
2.0 - రూ. 189.55 కోట్లు
సాహో - రూ. 142.95 కోట్లు
బాహుబ‌లి: ద బిగినింగ్ - రూ. 118.70 కోట్లు
కేజీఎఫ్: చాప్ట‌ర్ 1 - రూ. 44.09 కోట్లు
పుష్ప: ది రైజ్ - రూ. 39.95 కోట్లు
కబాలి - రూ. 28 కోట్లు
రోబో - రూ. 23.84 కోట్లు
కాల క‌రికాల‌న్ - రూ. 10.38 కోట్లు
సైరా.. న‌ర‌సింహారెడ్డి - రూ. 7.93 కోట్లు