English | Telugu
అతని కోసం నాలుగేళ్ల తర్వాత కదిలిన సోనాక్షి
Updated : Mar 3, 2023
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పేరు ఇప్పుడు ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం అక్షయ్‌కుమార్. అవును... వాళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారు. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా బడేమియా చోటేమియా. ఈ సినిమాలో అక్షయ్ పక్కన నటిస్తున్నారు సోనాక్షి సిన్హా. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇన్ని రోజులు హై ఇన్‌టెన్స్ ప్రాజెక్టులు చేసిన సోనాక్షి సిన్హా, ఇప్పుడు స్టార్ స్టడెడ్, కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ సంజయ్‌లీలా భన్సాలీతో హీరామండి చేశారు సోనాక్షి సిన్హా. అలాగే ఎక్సల్ ఎంటర్‌టైన్‌మెంట్, టైగర్ బేబీ ఫిల్మ్స్ దాహడ్‌లోనూ నటించారు. దాహడ్ ఆమెకు డిజిటల్ డెబ్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు మాత్రం అందరి దృష్టి అక్షయ్‌తో నటిస్తున్న బడేమియా చోటేమియా మీద ఉంది.
నాలుగేళ్ల తర్వాత అక్షయ్, సోనాక్షి జోడీ కడుతున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి సోనాక్షి మాట్లాడుతూ ``ఇంత మంచి ప్రాజెక్టులో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. అక్షయ్‌గారితో పనిచేయడం ఎప్పుడూ సూపర్బ్ ఎక్స్ పీరియన్స్. టైగర్‌తో ఫస్ట్ టైమ్ పనిచేస్తున్నాను. తనతో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని భావిస్తున్నాను. అలీ అబ్బాస్ జాఫర్ చాలా మంచి డైరక్టర్. ఈ సినిమా తప్పక బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆడియన్స్ కి తప్పకుండా థ్రిల్ కలిగించే సినిమా అవుతుంది`` అని అన్నారు. బడేమియా చోటేమియా ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తయింది. ముంబైలో తొలి షెడ్యూల్ చేశారు. సెకండ్ షెడ్యూల్‌ని స్కాట్లాండ్‌లోనూ, అబుదాబీలోనూ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి ఎండింగ్‌లో స్టార్ట్ అయ్యే ఈ షెడ్యూల్‌లో సోనాక్షి పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రంలో అక్షయ్, టైగర్, సోనాక్షితో పాటు సౌత్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మానుషి చిల్లర్ కీ రోల్ చేస్తున్నారు.