Read more!

English | Telugu

యాక్షన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ బాద్‌షా కుమార్తె!

టాలీవుడ్‌ హీరోలు ఎక్కువగా తమ కొడుకుల్నే హీరోలుగా పరిచయం చేస్తారన్న విషయం తెలిసిందే. కూతుళ్ళను సినిమాల్లోకి తీసుకొచ్చిన వారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ, బాలీవుడ్‌ దానికి పూర్తిగా భిన్నం. హీరోలు, క్యారెక్టర్‌ ఆరిస్టులు తమ కూతుళ్ళను హీరోయిన్లు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వారు చాలా మంది ఉన్నారు. హీరోలతోపాటు కూతుళ్ళు కూడా హీరోయిన్లుగా మంచి పేరు తెచ్చున్నారు. ఇటీవల బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ది ఆర్చీస్‌’ అనే చిత్రంతో సుహానా ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద పరిచయమయ్యారు. ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఇప్పుడు సుహానా ఖాన్‌ తన రెండో సినిమాతోనే యాక్షన్‌ హీరోయిన్‌గా రాబోతోంది. 

వివరాల్లోకి వెళితే.. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ మూవీని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాకి ‘కింగ్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. సుహానా తన రెండో సినిమాలోనే యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించబోతోంది. ఈ సినిమాలో షారూక్‌ ఖాన్‌, సుహానా ఖాన్‌ కలిసి నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ మేలో ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ కోసం స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతోంది సుహానా. ఇంటర్నేషనల్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ పర్యవేక్షణలో ఆమె ట్రైనింగ్‌ ఉంటుందని తెలుస్తోంది. వార్‌, పఠాన్‌, బ్యాంగ్‌ బ్యాంగ్‌ చిత్రాల దర్శకుడు సిద్థార్థ్‌ ఆనంద్‌, షారూక్‌ ఖాన్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ‘కింగ్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘పఠాన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘పఠాన్‌ 2’ ప్రారంభం కానుంది. పఠాన్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలోనే ‘పఠాన్‌2’ రూపొందనుంది.