English | Telugu

దుబాయ్ లో షారుక్ ఖాన్ హవా!

కింగ్ ఖాన్ షారూక్, రాజ్ కుమార్ హిరాని ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ డంకీ. రేపు అనగా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని షారుక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా డంకీ ప్రమోషన్స్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఒక ఈవెంట్ ఇప్పుడు ఇండియా లోనే బిగెస్ట్ ఈవెంట్ గా నిలిచింది.

డంకీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించుకొని ట్రెండింగ్ లో ఉంది. తాజాగా షారూక్ దుబాయ్ లో జరిగిన డంకీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అక్కడి వోక్స్ సినిమాస్‌లో నిర్వహించిన ఈవెంట్ లో షారుక్ పాల్గొనడంతో షారుక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈవెంట్ లో భాగంగా దుబాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రేక్షకుల కోసం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా షారుక్ అభిమానులు హాజరయ్యారు. పైగా షారూక్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా, ఓ మాహి పాటలకు డాన్స్ చేసి అభిమానుల్లో మరింత జోష్ ని పెంపొందించాడు. అలాగే ఒక భారీ డ్రోన్ తో షో మొత్తాన్ని కవర్ చేసారు. దీంతో ఆకాశమంతా వెలుగులుతో నిండిపోయిన డంకీ షో ని చూడటానికి రెండు కళ్ళు చాలేదు అలాగే టవర్ మీద షారుక్ ఖాన్ అనే అక్షరాలు కూడా వచ్చి షారుక్ అభిమానుల్లో మరింత జోష్ ని తీసుకొచ్చాయి.

ఈ ఈవెంట్ లో షారుక్ తో పాటు రాజ్ కుమార్ హిరాని, తాప్సీ కూడా పాల్గొని అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా డంకీ మూవీలోని చివరి పాటను విడుదల చెయ్యడమే కాకుండా మూవీలో ఉన్న హార్డి అనే కొత్త పాత్రను పరిచయం చేసి రాజ్ కుమార్ హిరాని అందరినీ ఆశ్చర్యపరిచారు. బొమన్ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ లాంటి నటులు నటిస్తున్న ఈ సినిమాని ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ లు నిర్మించారు.