English | Telugu
అల్లు అర్జున్‌ని ఫాలో అయిన షారుఖ్!
Updated : Jul 14, 2023
రజనీకాంత్, యష్, విజయ్, అల్లు అర్జున్ సినిమాలు తనకెలా ఉపయోగపడ్డాయో చెప్పారు హీరో షారుఖ్. ఆయన నటిస్తున్న సినిమా జవాన్. ఇటీవల విడుదలైన ప్రివ్యూకి మంచి స్పందన వస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాలో ఫీమేల్ గ్లామర్‌కి కొదవే లేదు. నయనతార ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో పరిచయమవుతున్నారు. దీపిక పదుకోన్ ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా అంటూ గ్యాంగ్ ఎలాగూ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం జవాన్‌లో కియారా అద్వానీ కూడా నటించారు.
ఇటీవల యష్‌రాజ్ స్టూడియోలో షారుఖ్, కియారా మీద స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. జవాన్‌లో ఇంటెన్స్ కేరక్టర్ చేస్తున్నారు షారుఖ్. జవాన్‌కి ప్రిపేర్ కావడానికి మీరేం చేశారంటూ నెటిజన్లు సరదాగా షారుఖ్‌ని ప్రశ్నించారు. అందుకు కింగ్ ఖాన్ సిన్సియర్‌గా సమాధానం చెప్పారు. ``నేను రజనీకాంత్, దళపతి విజయ్, అల్లు అర్జున్, యష్ సినిమాలు చాలా చూశాను. వాళ్ల సినిమాలు చూడటం వల్ల చాలా వరకు ఎమోషన్స్ పట్టుకోగలిగాను. లాంగ్వేజ్ మీద కాస్త గ్రిప్ సంపాదించుకోగలిగాను. అట్లీ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా చాలా చూశాను`` అని అన్నారు. షారుఖ్ ఇంత నిజాయతీగా సమాధానం చెప్పడం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. బాలీవుడ్ బాద్షా అయి ఉండి, ఎమోషన్స్ పట్టుకోవడం కోసం ఇతర హీరోలు చూశానని చాలా వినమ్రంగా చెప్పారని, కించిత్ కూడా ఆయనకు ఈగోలేదని ప్రశంసిస్తున్నారు.
షారుఖ్ నటించిన పఠాన్ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలైంది. ఇప్పుడు జవాన్ సిద్ధమవుతోంది. పఠాన్ రికార్డులను జవాన్ తుడిచిపెట్టేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండిట్స్. నెక్స్ట్ సినిమా హిరానీదే. ఆయన దర్శకత్వంలో డంకీ తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్ హిరానీ మూవీలో హీరోయిన్‌గా తాప్సీ నటిస్తోంది.