Read more!

English | Telugu

సోనాక్షి సిన్హా ఎవ‌రి జ్ఞాప‌కాల్లో క‌రుగుతున్నారో తెలుసా? 

బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ న‌టి సోనాక్షి రీసెంట్‌గా ఫిన్‌ల్యాండ్ వెళ్లారు. మంచు ప్రాంతంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు సోనాక్షి. తెలుపు గుర్రం, చుట్టూ మంచు, తెల్ల‌టి వ‌స్త్రాల్లో వావ్ అనిపిస్తున్నాయి సోనాక్షి పిక్స్. అంతే కాదు, త‌న టెంట్‌లో కాఫీ తాగుతూ ది బెస్ట్ కాఫీ అని కూడా రాసుకున్నారు సోనాక్షి. 

ఫిన్‌ల్యాండ్‌లోని ఓ రిసార్ట్ లో ఆమె బ‌స చేశారు. వింట‌ర్ వండ‌ర్‌ల్యాండ్ అంటూ త‌ను గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకుంటున్నారు. అద్భుత‌మైన క్యాబిన్‌, చుట్టూ మంచు, త‌నివితీర‌ని ప్రేమ‌, ఫ‌ర్రీ గుర్రాలు, టెంట్లు, బెస్ట్ కాఫీ, ఆ క్ష‌ణాలు మ‌ధురాతిమ‌ధురం. మ‌రొక్క‌సారి వెళ్లి రావాల‌నిపిస్తోంది`` అని రాసుకున్నారు.సోనాక్షి వింట‌ర్ వండ‌ర్‌ల్యాండ్ ఫెయిరీ టేల్‌లాగా ఉంద‌ని అంటున్నారు ఫ్యాన్స్. మా డ‌బుల్ ఎక్స్ ఎల్ యాక్ట్ర‌స్ ధ‌రించిన కాస్ట్యూమ్స్ కూడా చాలా స్పెష‌ల్‌గా ఉన్నాయ‌ని అంటున్నారు ఫ్యాన్స్. యాంకిల్ లెంగ్త్  ప‌ఫ‌ర్ జాకెట్‌కి బ్లాక్ లెద‌ర్ ప్యాంట్స్, బ్లాక్ స్వెట‌ర్‌, సేమ్ క‌ల‌ర్ బూట్స్, గ్ల‌వ్స్ జ‌బ‌ర్ద‌స్త్ గా సూట్ అయ్యాయ‌ని మెచ్చుకుంటున్నారు.

మంచుతో ఆడుకుంటూ, స‌ర‌దాగా ఫొటోల‌కు ఫోజులిస్తూ బెస్ట్ మొమెంట్స్ ని గుండెల్లో ప‌దిలం చేసుకున్నారు సోనాక్షి. ``మీరేమైనా అనండి. అనుకోండి. నా దృష్టిలో శాంతాక్లాజ్ నిజంగానే ఉన్నారు. నేను ఆర్కిటిక్ స‌ర్కిల్‌ని క్రాస్ చేశాను. నేను అత‌న్ని క‌లిశాను. ఫిన్‌ల్యాండ్‌లో తొలిసారి స్నో ఏంజెల్స్ చేశాను. ఐస్ స్కేటింగ్ ఇక్క‌డే చేశాను. ఏవో జ్ఞాప‌కాల‌ను పోగేసుకోవ‌డానికి వెళ్లాను. చాలా గొప్ప అనుభవాల‌తో తిరిగి వ‌చ్చాను. ఐస్‌తో చేసిన నైట్ క్ల‌బ్‌లో పార్టీకి వెళ్లాను. గ్లాస్ ఇగ్లూలో భోజ‌నం చేశాను. చాలా చ‌ల్ల‌టి ప్ర‌దేశం అది. కానీ నేను మాత్రం ఆ జ్ఞాప‌కాల‌లో క‌రుగుతున్నా`` అని రాసుకొచ్చారు సోనాక్షి.