English | Telugu

ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోన్న 'సీటీమార్' సాంగ్‌!

ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోన్న 'సీటీమార్' సాంగ్‌!

 

స‌ల్మాన్ ఖాన్ టైటిల్ పాత్ర‌ధారిగా ప్ర‌భుదేవా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్‌'. ఈ మూవీలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా స‌ల్మాన్ క‌నిపించ‌నున్నారు. దిశా ప‌టాని నాయిక‌గా న‌టించిన ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సాంగ్‌గా 'సీటీమార్‌'ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఇది బాలీవుడ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. అతి త‌క్కువ టైమ్‌లో 100 మిలియ‌న్ వ్యూస్ సాధించిన బాలీవుడ్ సాంగ్‌గా సీటీమార్ రికార్డుల్లోకి ఎక్కింది. మ‌రే బాలీవుడ్ సాంగ్ దాని ద‌రిదాపుల్లో లేద‌ని అక్క‌డి వ‌ర్గాలు చెబుతున్నాయి. 

ఈ పాట‌కు తెలుగు సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ ఇవ్వ‌డం ఇక్క‌డ విశేషం. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' సినిమా కోసం మొద‌టిసారిగా 'సీటీమార్' సాంగ్‌ను కంపోజ్ చేశాడు దేవి. ఆ సాంగ్ బాగా న‌చ్చి త‌మ సినిమా కోసం అవే బాణీల‌ను రిక్రియేట్ చేయ‌మ‌ని దేవిని అడిగాడు స‌ల్మాన్‌. దాంతో స‌రికొత్త‌గా మ‌ళ్లీ ట్యూన్స్ ఇచ్చాడు దేవి.

ష‌బ్బీర్ అహ్మ‌ద్ లిరిక్స్ రాసిన ఈ పాట‌ను క‌మాల్ ఖాన్‌, యూలియా వంటూర్ ఆల‌పించారు. జాని మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో స‌ల్మాన్‌, దిశ‌, డాన్స‌ర్ల బృందంపై ఆ పాట‌ను చిత్రీక‌రించాడు ప్ర‌భుదేవా. ఇది హిందీ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను విప‌రీతంగా అల‌రిస్తోంది. ఏప్రిల్ 26 నుంచి ఇప్ప‌టివర‌కూ 107 మిలియ‌న్ వ్యూస్‌ను ఈ సాంగ్ సాధించింది. రంజాన్ సంద‌ర్భంగా మే 13న 'రాధే' సినిమా ఏక కాలంలో అటు థియేట‌ర్ల‌లో, ఇటు ఓటీటీలో విడుద‌ల‌వుతోంది.