Read more!

English | Telugu

విక్కీ కౌశ‌ల్‌కి జంట‌గా సారా అలీ ఖాన్

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్న బాలీవుడ్ క‌థానాయ‌కుల్లో విక్కీ కౌశ‌ల్ ఒక‌రు.  తాజాగా ఈ యంగ్ హీరో.. చారిత్ర‌క నేప‌థ్యంతో కూడిన ఓ సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. `ది ఇమ్మోర్ట‌ల్ అశ్వ‌థ్థామ‌` పేరుతో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కాగా, ఈ చిత్రంలోని పాత్ర కోసం విక్కీ ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నారు. గుర్ర‌పు స్వారీ, విలు విద్య వంటి వాటిలో త‌ర్ఫీదు పొందుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్ కి జంట‌గా సైఫ్ అలీ ఖాన్ త‌న‌య సారా అలీ ఖాన్ సంద‌డి చేయ‌నుంద‌ని బాలీవుడ్ బ‌జ్. విక్కీ, సారా కాంబినేష‌న్ లో వ‌స్తున్న మొద‌టి సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు.. ఇప్ప‌టివ‌ర‌కు ప్రేమ‌క‌థ‌ల్లో, స‌ర‌దా చిత్రాల్లోనే క‌నిపిస్తూ వ‌చ్చిన సారా.. `ది ఇమ్మోర్ట‌ల్ అశ్వ‌థ్థామ‌` కోసం తొలిసారిగా భారీ పోరాట ఘ‌ట్టాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. మ‌రి.. విక్కీ, సారా చేస్తున్న ఈ వినూత్న ప్ర‌య‌త్నం.. వారికి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.