English | Telugu
మరో సౌత్ స్టార్‌ను డీ కొట్టనున్న సంజయ్ దత్
Updated : Sep 2, 2023
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పుడు దక్షిణాది సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాల హోరు ఎక్కువైంది. దీంతో సంజు బాబా అయితే బాలీవుడ్‌లో మార్కెట్ చేసుకోవచ్చు. ఇక నటన పరంగా ఆయనకు ఏ వంకా పెట్టలేం. దీంతో మన దక్షిణాది దర్శక, నిర్మాతలు సైతం సంజయ్ దత్‌ను సంప్రదిస్తున్నారు. ఆయన భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే కూడా మనవాళ్లు తగ్గేదే లే అని అనేస్తున్నారు. ఇప్పటికే కె.జి.యఫ్ చిత్రంలో అధీరగా మార్కులను కొట్టేసిన సంజయ్ దత్ ఇప్పుడు కన్నడలో కె.డి అనే సినిమాతో పాటు తమిళంలో లియో సినిమాలో నటిస్తున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ప్రభాస్, మారుతి సినిమాలోనూ నటిస్తున్నారు.
కాగా ఇప్పుడు సంజయ్ దత్ మరో సౌత్ స్టార్ హీరో సినిమాలో నటించటానికి రెడీ అయినట్లు టాక్. అసలు ఇంతకీ ఎవరా స్టార్ హీరో అంటే అజిత్ కుమార్. ఈయన కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ విడా మూయర్చి అనే సినిమాను రూపొందించనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మగిల్ తిరుమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌కు రోల్‌కు ధీటుగా ఉండే విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నారట. అక్టోబర్ నెలలో షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఎలాంటి మేజర్ బ్రేక్ లేకుండా సినిమాను వచ్చే ఏడాది జనవరిలో పూర్తి చేయాలనేది ప్రస్తుత ఆలోచన.
అలాగే విడా మూయర్చి సినిమాను వచ్చే ఏడాది తమిళ కొత్త సంవత్సరాది సందర్బంగా విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది.
