Read more!

English | Telugu

తగ్గిన బాలీవుడ్ జోరు.. సౌత్ కి వస్తానంటున్న సల్మాన్ ఖాన్

'బాహుబలి'కి ముందు ఒక లెక్క, 'బాహుబలి' తర్వాత ఒక అన్నట్లుగా ఉంది నార్త్ లో సౌత్ సినిమాల జోరు. ఇటీవల 'పుష్ప ది రైజ్' హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇలా సౌత్ నుంచి వస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాలు నార్త్ లో తడాఖా చూపిస్తుంటే.. బాలీవుడ్ సినిమాలు మాత్రం సౌత్ లో అంతగా హవా చూపలేకపోతున్నాయి. ఇదే ఇప్పుడు బాలీవుడ్ జనాల్ని కలవరపెడుతుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా మీడియా సాక్షిగా తన బాధను పంచుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ నటిస్తున్న ఫస్ట్ డైరెక్ట్ సౌత్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. అయితే తాజాగా ముంబైలో నిర్వహించిన ఐఫా అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సౌత్ సినిమాల గురించి సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవితో ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందని అన్నాడు. అలాగే చరణ్ కూడా మంచి ఫ్రెండ్ అని, ఆర్ఆర్ఆర్ లో చక్కగా నటించాడని కొనియాడాడు. అదే ఫ్లోలో సౌత్ లో హిందీ సినిమాలకు ఆదరణ లభించకపోవడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సౌత్ సినిమాలు హిందీ మార్కెట్ లో సత్తా చాటుతున్నాయని, కానీ హిందీ సినిమాలు మాత్రం సౌత్ లో ఎందుకో ఆదరణ పొందలేకపోతున్నాయని సల్మాన్ అన్నాడు. సౌత్ సినిమాలలో హీరోయిజం ఉంటుందని, అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అన్నాడు. ఒకప్పుడు హిందీ సినిమాల్లోనూ హీరోయిజం ఉండేదని, అయితే ఇప్పుడు సౌత్ ఫిల్మ్ మేకర్స్ దానిని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు. సౌత్ రైటర్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారని, మంచి మంచి కాన్సెప్ట్స్ రాస్తున్నారని కొనియాడాడు. సౌత్ లో సినీ అభిమానులు చాలా ఎక్కువ ఉంటారని, వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఆదరిస్తారని అన్నాడు. సౌత్ సినిమాల్లో నటించడం తనకీ ఇష్టమేనని, తెలుగు తమిళ్ సినిమాల్లో నటించే అవకాశమొస్తే కచ్చితంగా నటిస్తానని సల్మాన్ తన మనసులో మాట బయటపెట్టాడు.