Read more!

English | Telugu

వ‌రుణ్ ధావ‌న్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా 'బ‌వాల్‌'

 

శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ మ‌రో సినిమాకు సంత‌కం చేసింది. వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న న‌టించేందుకు అంగీక‌రించింది. ఇదివ‌ర‌కు 'చిచ్చోరే' లాంటి సూప‌ర్ హిట్ సినిమా తీసిన నిర్మాత సాజిద్ న‌దియ‌డ్‌వాలా, డైరెక్ట‌ర్ నితీష్ తివారీ కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాకు 'బ‌వాల్' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. 2023 ఏప్రిల్ 7న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో వెండితెర‌పై జాన్వీ, వ‌రుణ్ మ‌ధ్య కెమిస్ట్రీ చూసేందుకు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కొంత కాలంగా ఈ సినిమా గురించి ఆన్‌లైన్‌లో ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది. ఇప్పుడు అది వాస్త‌వ‌మ‌ని స్ప‌ష్ట‌మైంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. జాన్వీ ఇప్ప‌టికే 'గుడ్‌ల‌క్ జెర్రీ', 'మిలి' సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసింది. ప్ర‌స్తుతం కొలిన్ డి కున్హా డైరెక్ష‌న్‌లో 'దోస్తానా 2' సినిమా చేస్తోంది. ఈ మూవీలో ల‌క్ష్ ల‌ల్వానీ, అభిషేక్ బెన‌ర్జీ హీరోలుగా న‌టిస్తున్నారు.