English | Telugu

బ‌డా కంపెనీల సీఈవోల జీతం కంటే అనుష్క బాడీగార్డ్ జీతం ఎక్కువ‌!

స్టార్ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ తమ భద్రత విషయంలో ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా వెనుకాడ‌ర‌ని మ‌న‌కు తెలుసు. సెలబ్రిటీలు బ‌య‌ట‌కు అడుగుపెట్టినప్పుడు వారికి ఎలాంటిముప్పు లేదని నిర్ధారించడానికి వ్యక్తిగత భద్రత అవసరం. అదే త‌ర‌హాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మకు కూడా కొన్నేళ్ల నుంచీ సోను అనే వ్యక్తిగత బాడీగార్డ్ ఉన్నాడు. సోను అస‌లు పేరు ప్ర‌కాశ్ సింగ్‌. అత‌ని సేవలకు అనుష్క భారీ స్థాయిలో జీతం చెల్లిస్తోంది.

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవడానికి ముందే అనుష్కను సోను అంటిపెట్టుకొని ఉన్నాడ‌నేది గమనించాల్సిన విష‌యం. జూమ్.కామ్ ప్రకారం, ప్రకాశ్‌ సింగ్ వార్షిక వేతనం సుమారు రూ. 1.2 కోట్లు. ఇది క‌రెక్ట‌యితే, సోను జీతం చాలా కంపెనీల సీఈవోల‌ వార్షిక జీతం కంటే ఎక్కువ అని చెప్పడం తప్పు కాదు.

అనుష్కకు సోనును కేవ‌లం బాడీగార్డ్‌గా మాత్రమే కాకుండా, అతన్ని ఒక కుటుంబం కంటే ఎక్కువగా ప‌రిగ‌ణిస్తుంటాడు విరాట్‌. అనుష్క నిజంగా సోనును తన కుటుంబంలో ఒక భాగమని భావించి, ప్రతి సంవత్సరం అత‌డి పుట్టినరోజును జరుపుతుంటుంది. వాస్తవానికి, షారుఖ్ ఖాన్‌తో కలిసి త‌ను చేసిన 'జీరో' సినిమా సెట్స్‌పై సైతం సోను పుట్టినరోజును జ‌రిపింది అనుష్క‌.

బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు విరాట్ కోహ్లీని కూడా సోను కాపలా కాస్తాడు. భారత కెప్టెన్‌కు సొంత‌ వ్యక్తిగత భద్రత ఉన్నప్పటికీ కోహ్లీకి సోను భద్రత కల్పిస్తున్నాడని గమనించాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.