English | Telugu
సన్నీ లియోన్ ముంబై ఇంటి లోపలి వైభోగం చూసి తీరాల్సిందే!
Updated : Jul 15, 2021
భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ముంబైలో కొత్త ఇంటిని కొనడంతో సన్నీ లియోన్‌లో వ్యక్తమవుతోన్న ఆనందం అంతా ఇంతా కాదు. అంధేరీలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో అందమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది సన్నీ. తన ఇల్లు ఎలా ఉందో ఫ్యాన్స్‌కు, ఫాలోయర్స్‌కు సోషల్ మీడియా ద్వారా ఆమె చూపించింది. కొత్త ఫ్లాట్‌ను సొంతం చేసుకున్న ఆమెపై వారు ప్రశంసల జల్లు కురిపించి, శుభాభినందనలు తెలుపుతున్నారు.
రెగ్యులర్‌గా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా టైమ్‌ను గడుపుతుంటుందో వీడియోలు, ఫొటోల ద్వారా ఆమె పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తన కొత్త నివాసానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసింది. వాటిలో సన్నీని డేనియల్ ఎత్తుకొని ఫ్లాట్‌లోకి తీసుకుపోతున్న ఇమేజెస్ కూడా ఉన్నాయి.
“Here we go baby love @dirrty99 !! A new chapter in our life here in India begins!! ఇండియాలో మా జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది!! ఈ ఇల్లు నాకు నచ్చింది. ఇక్కడ మేం నిర్మించుకున్న జీవితం నచ్చింది. ముగ్గురు అందమైన పిల్లలతో ఈ అందమైన ఇంటికి కళ వచ్చింది. #satnamwaheguru (sic),” అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌గా జోడించింది సన్నీ.
సైకలాజికల్ థ్రిల్లర్ 'షేరో'లో హీరోయిన్‌గా త్వరలో కనిపించనున్నది సన్నీ లియోన్. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజెల్స్‌లో 'స్ప్లిట్స్‌విల్లా' సీజన్ 3లో పాల్గొంటూ ఉంది. ఇటీవల ఆమె దేవాంగ్ ధొలాకియా డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ 'బుల్లెట్స్'లో కనిపించింది. ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అయిన అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
