Read more!

English | Telugu

ఆలియా పెళ్లికి 'RRR' టీమ్!

బాలీవుడ్ జంట ఆలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 20న వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనున్న ఈ విహహా వేడుకకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో సీత పాత్రలో ఆలియా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైములో తారక్, చరణ్ తో ఆలియాకి మంచి స్నేహం ఏర్పడింది. అలాగే రాజమౌళిపై ఆమెకు ప్రత్యేక అభిమానం ఉంది. మరోవైపు ర‌ణ‌బీర్ కూడా రాజమౌళికి ఎంతో గౌరవమిస్తాడు. ర‌ణ‌బీర్, ఆలియా జంటగా నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాని సౌత్ లో రాజమౌళినే సమర్పిస్తున్నాడు. ఓసారి ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగిన సమయంలో రాజమౌళి కాళ్లకి దణ్ణం పెట్టి ఆశ్చర్యపరిచాడు ర‌ణ‌బీర్. 

ర‌ణ‌బీర్, ఆలియా ప్రత్యేకంగా రాజమౌళితో పాటు తారక్, చరణ్ లను ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆలియా పెళ్లి వేడుకలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ సందడి చేయనుందని న్యూస్ వినిపిస్తోంది.