English | Telugu

ఎయిర్‌పోర్ట్‌లో "మ్యాన్‌-అప్" హుడీతో ప్ర‌త్య‌క్ష‌మైన రియా!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అప‌నింద‌లు పాలై, దానికి సంబంధించిన డ్ర‌గ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొని, కొన్ని రోజుల పాటు జైలులో గ‌డిపి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాలీవుడ్ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. తండ్రి ఇంద్ర‌జిత్ చ‌క్ర‌వ‌ర్తి, సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి క‌నిపించిందామె. దీనికి సంబంధించిన ఫొటోల‌ను బాలీవుడ్ ఫొటోగ్రాఫ‌ర్లు త‌మ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు. రియా కొంచెం పెద్ద‌దిగా ఉన్న వైట్ క‌ల‌ర్ హుడీ ధ‌రించింది. దానిపై ‘Man-Up’ అనే స్లోగ‌న్ రాసి ఉండ‌టం గ‌మ‌నార్హం.

అయితే ఒక స్లోగ‌న్‌తో రియా హుడీ లేదా టీ ష‌ర్ట్ ధ‌రించి క‌నిపించ‌డం ఇదే తొలిసారి కాదు. ఇదివ‌ర‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో త‌న‌ను అరెస్ట్ చేయ‌డానికి ముందు “Roses are red, violets are blue, Let’s smash patriarchy, Me and you” అనే స్లోగ‌న్ రాసిన టీ-ష‌ర్ట్‌ను ఆమె ధ‌రించింది. రియా అరెస్ట‌య్యాక ఆమెకు స‌పోర్ట్‌గా ఆ స్లోగ‌న్‌ను చాలా మంది సెల‌బ్రిటీలు షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏడాది క్రితం వ‌ర‌కు రియా పెద్ద‌గా వార్త‌ల్లో వ్య‌క్తి కాదు. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ మృతి చెందాడో అప్ప‌ట్నుంచీ ఆమె వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయింది. ప్ర‌స్తుతం బెయిల్ మీద ఉన్న ఆమె, క్ర‌మ‌క్ర‌మంగా సాధార‌ణ జీవితంలోకి తిరిగి వ‌స్తూ ఉంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.