Read more!

English | Telugu

హిందీ 'ఛ‌త్ర‌ప‌తి' స‌ర‌స‌న దిశా ప‌టాని!

 

టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ఛత్ర‌ప‌తి'.. హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతోనే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ కూడా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ షురూ కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయిశ్రీ‌నివాస్ తో జ‌ట్టుక‌ట్టే నాయిక గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అన‌న్యా పాండేతో స‌హా ప‌లువురు బాలీవుడ్ భామ‌ల పేర్లను ఈ రీమేక్ తో ముడిపెట్టారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో బెల్లంకొండ‌కి జోడీగా హాట్ బ్యూటీ దిశా ప‌టానిని ఎంపిక చేశార‌ట‌. అంతేకాదు.. ఈ పాత్ర కోసం భారీ మొత్త‌మే అమ్మ‌డు పుచ్చుకోనుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ లో దిశా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. సాయిశ్రీ‌నివాస్, దిశాప‌టాని జంట కాసుల పంట పండిస్తుందేమో చూడాలి. ఈ ఏడాది చివ‌ర‌లో 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.