English | Telugu

సంజ‌య్‌ద‌త్ మీద ర‌వీనాకి క్ర‌ష్‌.. అత‌నేం చేసేవాడో తెలుసా?

త‌మ‌కి ఎవ‌రిమీదైనా క్ర‌ష్ ఉంటే, ఇదివ‌ర‌కు హీరోయిన్లు పెద్ద‌గా రివీల్ చేసేవారు కాదు. ఒక‌వేళ చెప్పాల్సి వ‌చ్చినా, ఎవ‌రో సీనియ‌ర్ పేర్ల‌ను, లేకుంటే అస‌లు ఎప్పుడూ క‌ల‌వ‌రులే అనుకున్న‌వారి పేర్ల‌ను మాత్ర‌మే చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్ల స్టేట్‌మెంట్లూ మారుతున్నాయి. ఒక‌ప్ప‌టి హీరోయిన్, ఇప్ప‌టి కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ ర‌వీనా టాండ‌న్ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. ర‌వీనాటాండ‌న్‌కి ఆమె విజేత కో స్టార్ సంజ‌య్‌ద‌త్ మీద విప‌రీత‌మైన క్ర‌ష్ ఉండేద‌ట‌. సంజ‌య్‌ద‌త్‌, జాకీ ష్రాఫ్‌, సునీల్ శెట్టి, స‌న్నీడియోల్‌, గోవింద‌, స‌ల్మాన్‌తో నార్త్ లో మంచి సినిమాలు చేశారు ర‌వీనా టాండ‌న్‌. ఆ రోజుల‌ను గుర్తుచేసుకుంటూ ``మాకు చాలా మంచి ట్యూనింగ్ ఉండేది. వాళ్లంద‌రితో ప‌నిచేస్తున్న‌ప్పుడు న‌న్ను సెట్లో హాట్ చిక్‌గా ఎప్పుడూ చూసేవారు కాదు, వాళ్ల గ్యాంగ్‌లో ఓ మ‌గ‌రాయుడిగానే ట్రీట్ చేసేవారు. నేను చిన్న‌ప్పటి నుంచీ టామ్‌బోయ్ ప‌నుల‌ను చేసేదాన్ని. ఎప్పుడూ బోయ్స్ గ్యాంగ్‌తో క‌లిసి తిరిగేదాన్ని. అయినా నాకు సంజ‌య్‌ద‌త్ మీద విప‌రీత‌మైన క్ర‌ష్ ఉండేది. ఆ విష‌యం అత‌నికి కూడా తెలుసు. అయినా న‌న్ను వాళ్ల గ్యాంగ్‌లో చంటిపిల్లాడిని చూసిన‌ట్టే చూసేవాడు. సునీల్ ద‌త్ మా నాన్న‌గారికి మంచి స్నేహితుడు. అందుకే నాకు సంజు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. ప్రియ కూడా చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఫ్రెండ్‌. అంద‌రం దాదాపు క‌లిసే పెరిగాం. సెట్లోనూ అలాగే అల్ల‌రి చేసేవాళ్లం`` అని అన్నారు.

సంజ‌య్‌ద‌త్‌తో ర‌వీనా టాండ‌న్ జ‌మానే సే క్యా డ‌ర్నా, ఆతిష్‌, విజేత సినిమాలు చేశారు. 2022లో ఈ ఇద్ద‌రూ కేజీయ‌ఫ్‌లో కీ రోల్స్ చేశారు. ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం ర‌వీనాటాండ‌న్‌కి ప‌ద్మ‌శ్రీ ప్ర‌క‌టించింది. ఆమె న‌టిగా మాత్ర‌మే కాదు, సోష‌ల్ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.సంజ‌య్‌ద‌త్ మీద ర‌వీనాకి క్ర‌ష్‌... అత‌నేం చేసేవాడో తెలుసా? త‌మ‌కి ఎవ‌రిమీదైనా క్ర‌ష్ ఉంటే, ఇదివ‌ర‌కు హీరోయిన్లు పెద్ద‌గా రివీల్ చేసేవారు కాదు. ఒక‌వేళ చెప్పాల్సి వ‌చ్చినా, ఎవ‌రో సీనియ‌ర్ పేర్ల‌ను, లేకుంటే అస‌లు ఎప్పుడూ క‌ల‌వ‌రులే అనుకున్న‌వారి పేర్ల‌ను మాత్ర‌మే చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్ల స్టేట్‌మెంట్లూ మారుతున్నాయి. ఒక‌ప్ప‌టి హీరోయిన్, ఇప్ప‌టి కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ ర‌వీనా టాండ‌న్ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. ర‌వీనాటాండ‌న్‌కి ఆమె విజేత కో స్టార్ సంజ‌య్‌ద‌త్ మీద విప‌రీత‌మైన క్ర‌ష్ ఉండేద‌ట‌.

సంజ‌య్‌ద‌త్‌, జాకీ ష్రాఫ్‌, సునీల్ శెట్టి, స‌న్నీడియోల్‌, గోవింద‌, స‌ల్మాన్‌తో నార్త్ లో మంచి సినిమాలు చేశారు ర‌వీనా టాండ‌న్‌. ఆ రోజుల‌ను గుర్తుచేసుకుంటూ ``మాకు చాలా మంచి ట్యూనింగ్ ఉండేది. వాళ్లంద‌రితో ప‌నిచేస్తున్న‌ప్పుడు న‌న్ను సెట్లో హాట్ చిక్‌గా ఎప్పుడూ చూసేవారు కాదు, వాళ్ల గ్యాంగ్‌లో ఓ మ‌గ‌రాయుడిగానే ట్రీట్ చేసేవారు. నేను చిన్న‌ప్పటి నుంచీ టామ్‌బోయ్ ప‌నుల‌ను చేసేదాన్ని. ఎప్పుడూ బోయ్స్ గ్యాంగ్‌తో క‌లిసి తిరిగేదాన్ని. అయినా నాకు సంజ‌య్‌ద‌త్ మీద విప‌రీత‌మైన క్ర‌ష్ ఉండేది. ఆ విష‌యం అత‌నికి కూడా తెలుసు. అయినా న‌న్ను వాళ్ల గ్యాంగ్‌లో చంటిపిల్లాడిని చూసిన‌ట్టే చూసేవాడు. సునీల్ ద‌త్ మా నాన్న‌గారికి మంచి స్నేహితుడు. అందుకే నాకు సంజు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు.

ప్రియ కూడా చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఫ్రెండ్‌. అంద‌రం దాదాపు క‌లిసే పెరిగాం. సెట్లోనూ అలాగే అల్ల‌రి చేసేవాళ్లం`` అని అన్నారు. సంజ‌య్‌ద‌త్‌తో ర‌వీనా టాండ‌న్ జ‌మానే సే క్యా డ‌ర్నా, ఆతిష్‌, విజేత సినిమాలు చేశారు. 2022లో ఈ ఇద్ద‌రూ కేజీయ‌ఫ్‌లో కీ రోల్స్ చేశారు. ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వం ర‌వీనాటాండ‌న్‌కి ప‌ద్మ‌శ్రీ ప్ర‌క‌టించింది. ఆమె న‌టిగా మాత్ర‌మే కాదు, సోష‌ల్ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.