English | Telugu

కంగ‌న‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన సీనియ‌ర్ ఆర్టిస్ట్

మ‌నం స్త్రీశ‌క్తి గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే కంగనా రనౌత్ లాంటి ప్ర‌తిభావంతులైన అమ్మాయిల గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుకోవాలి అని అన్నారు అనుప‌మ్ ఖేర్‌. ఇటీవ‌ల ఆయ‌న నార్త్ మీడియాతో మాట్లాడారు. "కంగ‌న చాలా ఫోక‌స్‌గా ఉంటుంది. చేస్తున్న ప‌నిపట్ల సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉన్న అమ్మాయి. చాలా ధైర్య‌వంతురాలు. అత్యుత్త‌మ ద‌ర్శ‌కురాలు. నేను ఇప్ప‌టిదాకా 534 సినిమాల‌కు ప‌నిచేశాను. అయినా కంగ‌న గురించి ఇంత బాగా చెబుతున్నానంటే ఆమె ప్ర‌తిభ ఎలాంటిదో అర్థం చేసుకోండి" అని చెప్పారు అనుప‌మ్ ఖేర్‌.

ఆయ‌న మాట‌ల‌కు కంగ‌న పొంగిపోయారు. ఆయ‌న‌కు వెంట‌నే ధ‌న్య‌వాదాలు చెప్పారు. "ప్ర‌జలంద‌రూ విమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ గురించి మాట్లాడుతారు. కానీ త‌మ ఈగోల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌హిళ‌ల్ని పొగ‌డ‌టానికి త‌ట‌ప‌టాయిస్తూ ఉంటారు. నిజ‌మైన పురుషుడు ప్ర‌తిభావంతులైన అమ్మాయిల‌ను ప్రోత్స‌హించ‌డంలో, ప్ర‌శంసించ‌డంలో ఎప్పుడూ వెన‌క‌డుగు వేయ‌డు. అత‌ని మ‌న‌సు ఎంత విశాల‌మైందో, అత‌ను చెప్పే ఆ నాలుగు మాట‌ల‌ను బ‌ట్టే అర్థ‌మ‌వుతుంది. అనుప‌మ్‌ ఖేర్ పురుషోత్త‌ముడు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం నా అదృష్టం. ఆయ‌న చుట్టూ ఉంటే జ్ఞాన సంప‌ద అబ్బిన‌ట్టు ఉంటుంది" అని అన్నారు కంగ‌న‌.

కంగ‌న కీల‌క పాత్రలో న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఎమ‌ర్జెన్సీ. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం త‌న ఆస్తుల‌ను తాక‌ట్టుపెట్టిన‌ట్టు ఆ మ‌ధ్య ప్ర‌క‌టించారు కంగ‌నా. ఈ సినిమాలోనే అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

కంగ‌న న‌టించిన దాఖ‌డ్ పెద్ద డిజాస్ట‌ర్ అయింది. సౌత్ త‌లైవి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన త‌లైవి కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే ఇప్పుడు ఎమ‌ర్జెన్సీ మీద హోప్స్ పెట్టుకున్నారు కంగ‌న‌. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం మీద ఇప్ప‌టికే జ‌నాల్లో ఆసక్తి క్రియేటైంది.