Read more!

English | Telugu

త్వ‌ర‌లో సినిమా రూపంలో రానున్న 'శ‌క్తిమాన్‌'

పండిట్ గంగాధర్ విద్యాధర్ మాయదారి ఓంకారనాథ్ శాస్త్రి అంటే ఇప్పటి వాళ్లకు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ  1990ల కాలం వాళ్ల‌కు మాత్రం ఈ పేరు సుప‌రిచిత‌మే. ఎందుకంటే అంత పెద్ద పేరుని సింప్లిఫై చేసి 'శక్తిమాన్' అనే పేరు పెట్టుకుని దూరదర్శన్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు మరి మన శాస్త్రి. ఈ సీరియల్ కోసం చిన్నా, పెద్దా అందరూ కూడా ఆదివారాల కోసం ఎదురు చూసేవారు. హిందీ అర్థం కాకపోయినా చూసి ఎంజాయ్ చేసిన సీరియల్ ఇది. 

శక్తిమాన్ చేసే ఫీట్లు ఇంట్లో కూడా పిల్లలు చేయడానికి ట్రై చేసి ఇబ్బందులు కూడా పడిన సంఘటనలు అప్పట్లో న్యూస్ పేపర్స్ ప్రచురించేవి. ఈ శక్తిమాన్ పోజ్ తో ఉన్న స్టిక్కర్లు పుస్తకాలకు అంటించుకునేవాళ్ళు. అలాగే ఎన్నో ఆడుకునే బొమ్మలు కూడా అప్పట్లో బాగా మార్కెట్ అయ్యేవి. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ 'శక్తిమాన్' సీరియల్ సరికొత్త మూవీగా మళ్ళీ మన ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని టాక్. 

ఇక ఈ మూవీలో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆఫీషియల్ న్యూస్ త్వరలో రాబోతోంది. ముఖేష్ ఖన్నా ఎక్కడ కనిపించినా శక్తిమాన్ అనే పిలుస్తారు చాలామంది. ఇప్పుడు ఈ టీవీ షో హక్కుల్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుని భీష్మ్ ఇంటర్నేషనల్ తో కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సిద్ధమౌతోంది. 

ఈ సీరియల్ అప్పట్లో దూరదర్శన్ లో ఒక 500 ఎపిసోడ్స్ కి పైగా టెలికాస్ట్ అయ్యింది. 1997 సెప్టెంబర్ 13 నుంచి 2005 మార్చ్ 27 వరకు ప్రసారమయ్యింది. ఐతే దీని సీక్వెల్ వస్తుందేమో అని అనుకున్నారు కానీ పిల్లలంతా ఈ సీరియల్ కేరెక్టర్ ని బాగా ఇమిటేట్ చేస్తుండడంతో ఈ సీరియల్ ప్రసారం చేయడాన్ని నిలిపేశారు. ఐతే ఇప్పుడు మాత్రం వెండితెరను పలకరించడానికి సిద్ధమౌతోంది. ఈ విషయం తెలుసుకుని 90ల‌ వాళ్లంతా కూడా ఇప్పుడు కేరింతలు కొడుతున్నారు.