English | Telugu
కూతురు కోసం సినిమాలు ఆపేస్తున్న అగ్ర హీరో
Updated : Oct 25, 2023
80 ,90 వ దశకాల్లో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన అగ్ర హీరోల్లో రిషి కపూర్ కూడా ఒకరు . ఎన్నో హిట్ సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానులని ఆయన సంపాదించుకున్నాడు. రిషి కపూర్ నట వారసుడుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రణబీర్ కపూర్ తన తండ్రి రిషి కపూర్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు నేడు బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడిగా ముందుకు దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన తన సినిమా కెరీర్ నుంచి తీసుకున్న నిర్ణయంతో బాలీవుడ్ షాక్ కి గురయ్యింది.
రణబీర్ కి అలియా భట్ తో వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే. వాళ్లిదరికి ఇంకా సంవత్సరం కూడా నిండని ఒక పాప ఉంది. పాప పేరు రాహా. రాహా పుట్టినప్పటి నుంచి రణబీర్ తనతో ఎక్కువ సమయం గడపలేకపోయాడు. తన కూతురికి ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుస్తున్నాయని ప్రేమని వ్యక్త పరుస్తూ అలాగే ప్రేమని పొందగలిగేలా తన చూపులు ఉంటున్నాయని ఈ సమయంలో తన కూతురుతో ఒక ఆరునెలలు ఉంటూ ఆ ఆనంద క్షణాలని పొందాలని రణబీర్ కోరుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ రణబీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
రణబీర్ ప్రస్తుతం చేసిన యానిమల్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో అర్జున్ రెడ్డికే రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమాలకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ కి దర్శకత్వం వహించాడు. గ్యాంగ్ స్టార్ నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. డిసెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా యానిమల్ మూవీ విడుదల కాబోతుంది.