Read more!

English | Telugu

సందీప్‌రెడ్డి - ర‌ణ‌బీర్ - ర‌ష్మిక ఫిల్మ్‌ 'యానిమ‌ల్' షూట్ షురూ

 

తెలుగులో 'అర్జున్‌రెడ్డి', హిందీలో దాని రీమేక్ 'క‌బీర్ సింగ్' మూవీస్‌తో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న లేటెస్ట్ హిందీ ఫిల్మ్ 'యానిమ‌ల్' రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు మొద‌లైంది. బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్న ఈ మూవీలో జంట‌గా న‌టిస్తున్నారు. హిమాల‌యాల్లోని మ‌నాలీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది.

'యానిమ‌ల్' అనే టైటిల్‌ను ఎప్పుడైతే అనౌన్స్ చేశారో.. అప్ప‌ట్నుంచీ ఈ మూవీపై ఆడియెన్స్‌లో విప‌రీత‌మైన క్యూరియాసిటీ వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తోంది. ర‌ణ‌బీర్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఉద్దేశించే ఆ టైటిల్ పెట్టారు. ర‌ణ‌బీర్ లాంటి యాక్ట‌ర్, సందీప్ లాంటి డైరెక్ట‌ర్ క‌లిస్తే.. ఆ క్రేజే వేరు అన్న‌ట్లు ఉంది ప‌రిస్థితి. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియ‌న్ స్క్రీన్ మీద క‌నిపించ‌న‌టువంటి రోల్‌లో ర‌ణ‌బీర్ క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఈ రోల్ కోసం అత‌ను బాగా మేకోవ‌ర్ అవుతున్నాడు.

హిందీలో రూపొందుతోన్న 'యానిమ‌ల్' పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న‌ది. అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు చేస్తోన్న ఈ మూవీ 2023 ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానున్న‌ది.