English | Telugu

'డాక్ట‌ర్ జి' షూటింగ్ కోసం భోపాల్ వెళ్లిన ర‌కుల్‌ప్రీత్‌!

టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్‌ప్రీత్ సింగ్ మంగ‌ళ‌వారం భోపాల్ వెళ్లింది. ఆమె న‌టిస్తోన్న బాలీవుడ్ ఫిల్మ్ 'డాక్ట‌ర్ జి' షూటింగ్ అక్క‌డ జ‌రుగుతోంది. అనుభూతి క‌శ్య‌ప్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరో కాగా, మ‌రో కీల‌క పాత్ర‌లో షెఫాలీ షా న‌టిస్తున్నారు. ఆయుష్మాన్ స‌ర‌స‌న న‌టించ‌డం ర‌కుల్‌కు ఇదే తొలిసారి కావ‌డంతో ఆడియెన్స్‌లో ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. భోపాల్‌కు వెళ్తున్న దృశ్యాల‌ను ర‌కుల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.

ఇప్ప‌టికే జూలై 12 నుంచి భోపాల్‌లో ఆయుష్మాన్ 'డాక్ట‌ర్ జి' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అప్ప‌ట్నుంచి ఆ షూటింగ్ సెట్స్‌పై తీసిన ఫొటోల‌ను, వీడియోల‌ను ఆయుష్మాన్ షేర్ చేసుకుంటూ వ‌స్తున్నాడు.

ఒక మెడిక‌ల్ కాలేజీ క్యాంప‌స్‌లో న‌డిచే క‌థ‌తో 'డాక్ట‌ర్ జి' రూపొందుతోంది. డాక్ట‌ర్ ఉద‌య్ గుప్తా అనే పాత్ర‌లో ఆయుష్మాన్‌, అత‌నికంటే ఓ సంవ‌త్స‌రం సీనియ‌ర్ అయిన డాక్ట‌ర్ ఫాతిమా క్యారెక్ట‌ర్‌లో ర‌కుల్‌ప్రీత్ న‌టిస్తున్నారు. ఈ మూవీతో అనురాగ్ క‌శ్య‌ప్ సోద‌రి అనుభూతి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇదివ‌ర‌కు ఆమె 'అఫ్సాస్' అనే మిని-సిరీస్‌, 'మొయ్ మ‌ర్జాని' అనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన షార్ట్ ఫిల్మ్ తీసింది.

ర‌కుల్‌ప్రీత్ 'డాక్ట‌ర్ జి' కాకుండా బాలీవుడ్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌తో 'మేడే', అజ‌య్ దేవ్‌గ‌ణ్, సిద్ధార్థ్ మల్హోత్రాల‌తో 'థాంక్ గాడ్' సినిమాల‌ను చేస్తోంది.