English | Telugu

అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు 14 రోజుల జుడిసియ‌ల్ క‌స్ట‌డీ!

అశ్లీల చిత్రాలను రూపొందించి, వివిధ మొబైల్ యాప్స్ ద్వారా వాటిని ప‌బ్లిష్ చేస్తున్నార‌నే అభియోగంతో అరెస్ట‌యి పోలీస్ క‌స్ట‌డీలో ఉన్న వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా మంగ‌ళ‌వారం ముంబైలోని ఓ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ రోజుతో ఆయ‌న పోలీస్ కస్ట‌డీ ముగియ‌నుంది. అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్ర‌కారం శిల్పాశెట్టి భ‌ర్త‌కు న్యాయ‌స్థానం 14 రోజుల జుడిసియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.

జూలై 19న అరెస్ట‌యిన కుంద్రా మొద‌ట జూలై 23 వ‌ర‌కు క‌ట‌క‌టాల వెన‌క ఉండ‌గా, పోలీస్ క‌స్ట‌డీని జూలై 27 వ‌ర‌కు పొడిగించారు. ఈ క‌స్ట‌డీని స‌వాలు చేస్తూ, ఈ కేసులో త‌న‌కు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ కుంద్రా కోర్టును ఆశ్ర‌యించారు. ఈరోజు కేసును విచారించిన బాంబే కోర్టు అత‌డికి 14 రోజుల‌ జుడిసియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. అలాగే మ‌రికొన్ని రోజుల పాటు అత‌డిని త‌మ క‌స్ట‌డీలో ఉంచాల్సిందిగా క్రైమ్ బ్రాంచ్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్కరించింది.

ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ‌, మ‌హారాష్ట్ర‌: పోర్నోగ్ర‌ఫీ రాకెట్ కేసులో ముంబైలోని ఒక కోర్టు న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా, ర్యాన్ థోర్పేకు 14 రోజుల జుడిసియ‌ల్ క‌స్ట‌డీని విధించింది. అని ట్వీట్ చేసింది. బెయిల్ కోసం రాజ్ కుంద్రా హైకోర్టును ఆశ్ర‌యించాడు. రేపు దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. రాజ్ కుంద్రా కంపెనీ బాలీఫేమ్ మీడియా లిమిటెడ్ 2023-24 నాటికి రూ. 146 కోట్ల గ్రాస్ రెవెన్యూ, రూ. 30 కోట్ల నెట్ ప్రాఫిట్‌ సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న వ్య‌వ‌హారంపై చార్ట్ షీట్ దాఖ‌లైంది.