English | Telugu
నమ్మలేకపోతున్న రణ్‌వీర్...దేని గురించి?
Updated : Jul 19, 2023
రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ జంటగా నటిస్తున్న సినిమా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. ఈ చిత్రంలో ధర్మేంద్ర కీ రోల్ చేశారు. రణ్‌వీర్ సింగ్ తండ్రి పాత్రలో కనిపిస్తారు రణ్‌వీర్‌సింగ్. ఈ సినిమా ప్రమోషన్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్మేంద్రతో పనిచేయడం గురించి చెప్పారు రణ్‌వీర్ సింగ్. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ కీ రోల్స్ చేశారు. పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. బిగ్ స్క్రీన్స్ మీద ఈ నెల 28నుంచి అందుబాటులో ఉంటుంది. ధర్మేంద్రతో పనిచేయడం గురించి రణ్‌వీర్ మాట్లాడుతూ ``ధర్మేంద్ర సినిమా లెజెండ్. షోలే మూవీలో ఆయన్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నమ్మలేని నిజం అది. సర్రియల్ సిట్చువేషన్. ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుంది. సెట్లో ఆయన ఉంటే వాతావరణం చాలా గంభీరంగా ఉంటుంది.
కొత్త టెక్నాలజీ గురించి ఆయన అడిగి తెలుసుకునే విధానం ముచ్చటగా ఉంటుంది. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నా గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. గ్రేట్ ప్రివిలేజ్ ఇది. అద్భుతమైన జర్నీ`` అని అన్నారు. సెట్లో తొలిరోజు ధర్మేంద్రతో కలిసి నటించిన సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ ``సెట్లో తొలిరోజు మాకు పోటాపోటీ సీన్ పడింది. అంతా బాగా ప్రిపేర్ అయ్యాను. డైరక్టర్ ఫేస్ టు ఫేస్ షాట్ పెట్టారు. రోల్, కెమెరా యాక్షన్ అనగానే నేను ఆయన్ని చూశాను. అంతే... ఓ మై గాడ్ అనిపించింది. ఎదురుగా అంత పెద్ద వ్యక్తి ఉంటే, సీన్ ఎలా ఉంటుందో అర్థమైంది`` అంటూ నవ్వేశారు.
ఇప్పటికే రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సినిమా నుంచి పాటలు విడుదలయ్యాయి. షారుఖ్ ఖాన్ విడుదల చేసిన టీజర్‌కి, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పక్కా హిట్ సినిమా కలర్‌లో ఉంది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ.