Read more!

English | Telugu

'రోబో' త‌ర్వాత ప్లేస్‌లో 'పుష్ప‌'! రూ. 20 కోట్లు దాటిన హిందీ వెర్ష‌న్‌!!

 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' పార్ట్ 1 'పుష్ప‌: ది రైజ్' మూవీ డిసెంబ‌ర్ 17న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు ఒరిజిన‌ల్ స‌హా ద‌క్షిణాదిలోని మిగ‌తా భాష‌ల డ‌బ్బింగ్ వెర్ష‌న్లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతుండ‌గా, హిందీ వెర్ష‌న్ సైతం అనూహ్య‌మైన వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. నిజానికి మార్కెట్‌లో మంచి పోటీ ఉన్న‌ప్ప‌టికీ, వీకెండ్ త‌ర్వాత కూడా 'పుష్ప‌'కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టం గ‌మ‌నార్హం. సోమ‌వారం ఈ సినిమాకు రూ. 4.25 కోట్లు (నెట్‌), మంగ‌ళ‌వారం రూ. 4.05 కోట్లు వ‌సూల‌య్యాయి. వెర‌సి ఐదు రోజుల‌కు 'పుష్ప' హిందీ క‌లెక్ష‌న్ రూ. 20.14 కోట్ల‌కు చేరుకుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్ట‌డీగా క‌లెక్ష‌న్లు సాధిస్తోన్న 'పుష్ప', టాప్ 10 హిందీ డ‌బ్బింగ్ మూవీస్ చార్ట్‌లో స్థానం సంపాదించింది. ర‌జ‌నీకాంత్ 'కాలా' (రూ. 10.38 కోట్లు), చిరంజీవి 'సైరా.. న‌ర‌సింహారెడ్డి' (రూ. 7.93 కోట్లు) సినిమాలను వెన‌క్కి నెట్టి 'పుష్ప' ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తుండ‌టంతో రానున్న రోజుల్లో ర‌జ‌నీకాంత్ 'రోబో' హిందీ వెర్ష‌న్‌ను దాటి, ఏడో స్థానానికి ఎగ‌బాక‌నుంది. ఫ‌స్ట్ వీక్ పూర్త‌య్యేనాటికి 'పుష్ప' క‌లెక్ష‌న్లు రూ. 25 కోట్ల‌ను దాట‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. 

టాప్ 10 హిందీ డ‌బ్బింగ్ మూవీస్‌:

బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్ - రూ. 510.99 కోట్లు
2.0 - రూ. 189.55 కోట్లు
సాహో - రూ. 142.95 కోట్లు
బాహుబ‌లి: ద బిగినింగ్ - రూ. 118.70 కోట్లు
కేజీఎఫ్: చాప్ట‌ర్ 1 - రూ. 44.09 కోట్లు
కబాలి - రూ. 28 కోట్లు
రోబో - రూ. 23.84 కోట్లు
పుష్ప: ది రైజ్ - రూ. 20.14 కోట్లు
కాల క‌రికాల‌న్ - రూ. 10.38 కోట్లు
సైరా.. న‌ర‌సింహారెడ్డి - రూ. 7.93 కోట్లు