Read more!

English | Telugu

ప్రియాంక చోప్రా భ‌ర్త ఒక్క‌డి సంపాద‌న ఎంతో తెలుసా?

 

ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోనాస్ ఇప్ప‌టిదాకా అమెరిక‌న్ రియాలిటీ షో 'ద వాయిస్‌'లో రెండు సార్లు కోచ్‌గా పాల్గొన్నాడు. ఆ షో ద్వారా నిక్‌లోని ప్ర‌తిభా సామ‌ర్థ్యాలు ఎలాంటివో ప్ర‌పంచానికి తెలిసింది. ఆ షోతో అత‌ను బాగానే సంపాదించాడు. 'జోనాస్ బ్ర‌ద‌ర్స్' అనే మ్యూజిక్ బ్యాండ్‌తో త‌న కెరీర్‌ను ప్రారంభించాడు నిక్‌. ఆ బ్యాండ్‌లో అత‌ని బ్ర‌ద‌ర్స్ జో జోనాస్‌, కెవిన్ జోనాస్ కూడా పార్ట‌న‌ర్స్‌. జోనాస్ బ్ర‌ద‌ర్స్ మూడు స్టూడియో ఆల్బ‌మ్స్ - 'జోనాస్ బ్ర‌ద‌ర్స్' (2007), 'ఎ లిటిల్ బిట్ లాంగ‌ర్' (2008), 'లైన్స్‌, వైన్స్ అండ్ ట్ర‌యింగ్ టైమ్స్' (2009) - రిలీజ్ చేశారు. ఈ మూడూ క‌లిపి 5.2 మిలియ‌న్ కాపీలు అమ్ముడ‌య్యాయి. ఆ త‌ర్వాత ఆ బ్యాండ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నిక్ సోలోగా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు.

పాప్ స్టార్‌గా, యాక్ట‌ర్‌గా నిక్ సోలో కెరీర్ సూప‌ర్‌గా కొన‌సాగుతోంది. సోలోగా అత‌ను మూడు స్టూడియో ఆల్బ‌మ్స్ - 'నిక్ జోనాస్' (2014), 'లాస్ట్ యియ‌ర్ వాజ్ కాంప్లికేటెడ్' (2016), 'స్పేస్‌మ్యాన్' (2021) - రిలీజ్ చేశాడు. వాటితో పాటు పెద్ద సినిమాల్లో, టీవీ షోస్‌లో న‌టించే అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు నిక్‌. వాటిలో 'కింగ్‌డ‌మ్‌', 'స్క్రీమ్ క్వీన్స్' లాంటి టీవీ షోలు, గోట్‌, జుమాంజీ:  వెల్‌క‌మ్ టు ద జంగిల్‌, మిడ్‌వే, జుమాంజీ: ద నెక్ట్స్ లెవ‌ల్‌, క‌యాస్ వాకింగ్ లాంటి మూవీస్ ఉన్నాయి. ఒక అంచ‌నా ప్ర‌కారం ప్ర‌స్తుతం అత‌డి ఆస్తుల విలువ 50 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో దాని విలువ రూ. 369.95 కోట్లు. అందులో చెప్పుకోద‌గ్గ భాగం ద వాయిస్ షోలో పాల్గొన‌డం ద్వారా వ‌చ్చిందే.

కోచ్‌గా 'ద వాయిస్‌'లో పాల్గొన్నందుకు గాను ఒక్కో సీజ‌న్‌కు అత‌డికి 8 నుంచి 10 మిలియ‌న్ డాల‌ర్లు ల‌భించాయి. అంటే రెండు సీజ‌న్ల‌కు క‌లిపి అత‌డికి 16 నుంచి 20 మిలియ‌న్ డాల‌ర్లు ల‌భించాయ‌న్న మాట‌. 2018లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను అత‌ను పెళ్లాడాడు.